Tollywood: ప్రేక్షకులు థియేటర్లకు ఎందుకు రావడం లేదు?

సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు.

Updated : 09 May 2024 10:08 IST

సినిమాకు కథే హీరో. ఈ కథలే ఎంతో మంది ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించేలా చేస్తాయి. కానీ ప్రస్తుతం బాలీవుడ్‌లో అలాంటి కథా చిత్రాలు రాకపోవడంతో థియేటర్లలో సందడి లేదు. భారీ బడ్జెట్‌తో రూపొందించినా.. సినీప్రియుల్ని ఆకట్టుకునే కథలు, పాత్రలు లేకపోవడం వల్ల హిందీ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తాకొడుతున్నాయని అంటున్నాయి చిత్రవర్గాలు. ఇటీవలే విడుదలైన అక్షయ్‌ కుమార్‌ నటించిన ‘బడేమియా ఛోటేమియా’, అజయ్‌ దేవగణ్‌ ‘మైదాన్‌’ లాంటి చిత్రాల్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కించినా.. బాక్సాఫీసు వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. అయితే తాజాగా ప్రేక్షకుల్ని మెప్పించే ఆసక్తికర సినిమాలు రాకపోవడం వల్ల కొన్ని మల్టీఫ్లెక్స్‌లలోని ప్రదర్శనలను, సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. ఈ విషయాన్ని ముంబయికి చెందిన జీ7 మల్టీప్లెక్స్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ దేశాయ్‌ ఓ ఆంగ్ల మీడియాకు తెలిపారు. ‘‘కేవలం ఎన్నికలను, సమ్మర్‌ను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకోలేదు. ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్లు సినిమాలను తీయడం లేదు దర్శకులు. దీని వల్ల సినిమాలపై వారికి ఆసక్తి తగ్గిపోతుంది. ఒకప్పుడు హిందీ సినిమాలు అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించక బాక్సాఫీసు వద్ద పరాజయాన్ని అందుకునేవి. కానీ.. ఎప్పుడైతే దక్షిణాది చిత్రాలను రీమేక్‌ చేయడం మొదలుపెట్టారో.. అప్పటి నుంచి బాలీవుడ్‌ పరిస్థితి కొంచెం మెరుగుపడిందనుకోవచ్చు. కానీ ప్రస్తుతం దక్షిణాది పరిశ్రమ మీద ఆధార పడకుండా సినిమాల్ని తెరకెక్కిస్తున్నారు’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని