bhaje vayi vegam: విడుదల సెట్‌ అయ్యిందే...!

కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి.

Updated : 09 May 2024 10:07 IST

కార్తికేయ కథానాయకుడిగా నటిస్తున్న ‘భజే వాయు వేగం’ విడుదల ఖరారైంది. ఈ నెల 31న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు సినీ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో తెలిపాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ యు.వి.క్రియేషన్స్‌ సమర్పణలో.. యు.వి.కాన్సెప్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న చిత్రమిది. ప్రశాంత్‌ రెడ్డి చంద్రపు దర్శకత్వం వహిస్తున్నారు. కార్తికేయ సరసన ఐశ్వర్య మేనన్‌ నటించారు. ‘హ్యాపీడేస్‌’ ఫేమ్‌ రాహుల్‌ టైసన్‌ కీలక పాత్రని పోషించారు. ‘‘భావోద్వేగాలతో కూడిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ఇది. తండ్రీ తనయుల బంధం చుట్టూ మలిచిన సన్నివేశాలు చిత్రానికి ప్రధానబలం. గురువారం ఇందులోని ‘సెట్‌ అయ్యిందే..’ పాటని విడుదల చేస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. రాహుల్‌ టైసన్‌, తనికెళ్ల భరణి, రవిశంకర్‌, శరత్‌ లోహితస్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మాటలు: మధు శ్రీనివాస్‌, కళ: గాంధీ నడికుడికర్‌, ఛాయాగ్రహణం: ఆర్‌.డి.రాజశేఖర్‌, పాటలు: రధన్‌, నేపథ్య సంగీతం: కపిల్‌కుమార్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని