అతి త్వరగా పెళ్లి చేసుకోవాలని లేదు: సాయిధరమ్

అతి త్వరలో పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకి లేదని నటుడు సాయిధరమ్‌ తేజ్‌ తెలిపారు. సాయితేజ్‌ పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా పలు వెబ్‌సైట్లలో వరుస కథనాలు వస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహామే ఆయన చేసుకోనున్నారని కొన్నిసార్లు వార్తలు రాగా, మరికొన్నిసార్లు..

Published : 29 Oct 2020 10:11 IST

వరుస కథనాలపై నటుడి స్పందన

హైదరాబాద్‌: అతి త్వరగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకి లేదని నటుడు సాయిధరమ్‌ తేజ్‌ తెలిపారు. సాయితేజ్‌ పెళ్లి గురించి గత కొన్నిరోజులుగా పలు వెబ్‌సైట్లలో వరుస కథనాలు వస్తున్నాయి. పెద్దలు కుదిర్చిన వివాహామే ఆయన చేసుకోనున్నారని కొన్నిసార్లు వార్తలు రాగా, మరికొన్నిసార్లు.. సాయి తన చిన్ననాటి స్నేహితురాలితో ఏడడుగులు వేయనున్నారని కథనాలు ప్రచురితమయ్యాయి. అంతేకాకుండా వచ్చే ఏడాది ఆరంభంలో ఆయన బ్యాచ్‌లర్‌లైఫ్‌కి గుడ్‌బై చెప్పనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది.

తన పెళ్లి గురించి వస్తోన్న వార్తలపై నటుడు సాయితేజ్‌ తాజాగా స్పందించారు. త్వరగా పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం తనకి లేదని ఆయన తెలిపారు. తగిన వధువును వెతకాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారని, దానికి ఓకే చెప్పానని ఆయన అన్నారు. అంతేకాకుండా తన పెళ్లి విషయంలో మీడియా వాళ్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని, అందుకే ఇలాంటి రూమర్స్‌ వస్తున్నాయని వివరించారు.

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా ‘సోలో బ్రతుకే సో బెటర్‌’ చిత్రం తెరకెక్కింది. సుబ్బు దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్‌ ఇటీవల పూర్తయ్యింది. ఇందులో సాయితేజ్‌కు జంటగా నభా నటేష్‌ కనిపించనున్నారు. మరోవైపు త్వరలో ఆయన దేవకట్టా ప్రాజెక్ట్‌లో బిజీ కానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు