Lalitha: నటి కేపీఏసీ లలిత కన్నుమూత

సీనియర్‌ మలయాళీ నటి కేపీఏసీ లలిత (73) కన్ను మూశారు. ఐదు దశబ్దాలపాటు తల్లి, సోదరి, కోడలు, కుమార్తె ఇలా పలు సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఆమె మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాటకాలతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె ‘కుట్టుకుడుంబం’ చిత్రం ద్వారా వెండితెరపైకి

Updated : 24 Feb 2022 08:47 IST

సీనియర్‌ మలయాళీ నటి కేపీఏసీ లలిత (73) కన్ను మూశారు. ఐదు దశబ్దాలపాటు తల్లి, సోదరి, కోడలు, కుమార్తె ఇలా పలు సహాయ పాత్రల్లో నటించి ప్రేక్షకులకు దగ్గరైన ఆమె మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. నాటకాలతో ప్రస్థానం మొదలుపెట్టిన ఆమె ‘కుట్టుకుడుంబం’ చిత్రం ద్వారా వెండితెరపైకి అడుగుపెట్టారు. లలిత అసలు పేరు మహేశ్వరి అమ్మ. నాటకాలపై ఆసక్తితో కేరళ పీపుల్స్‌ ఆర్ట్స్‌ క్లబ్‌ (కేపీఏసీ)లో చేరి నటిగా కెరీర్‌ మొదలుపెట్టి కేపీఏసీ లలితగా గుర్తింపు పొందారు. 550పైగా చిత్రాల్లో నటించారు. అలాగే అమరం (1991), శాంతమ్‌ (2000) చిత్రాల్లోని నటనకు గానూ రెండుసార్లు ఉత్తమ సహాయ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారామె. అంతేకాకుండా కేరళ సంగీత అకాడెమీ ఛైర్మన్‌గా పనిచేశారు. పలు  ధారావాహికల్లోనూ లలిత నటించారు. 1978లో ప్రముఖ దర్శకుడు భరతన్‌తో ఆమె వివాహం   జరిగింది. 1998లో ఆయన చనిపోయారు. ఆ  దంపతులకు కుమార్తె శ్రీకుట్టి, కుమారుడు సిద్ధార్థ్‌ భరత్‌ను ఉన్నారు. సిద్ధార్థ్‌ నటుడు, దర్శకుడిగా మలయాళంలో గుర్తింపు పొందారు. లలిత మృతిపట్ల ప్రముఖ మలయాళ నటులు మమ్ముట్టి, మోహన్‌లాల్‌, సురేష్‌ గోపీతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని