అలా చేస్తే.. ఫెయిలైనట్లే

‘‘ప్రతి సినిమాలోనూ వినోదం ఉండటాన్ని నేను ఇష్టపడతాను. ఒక విషయం చెప్పాలిఅనుకున్నప్పుడు నవ్వించి చెప్తే తప్పేముంది అనిపిస్తుంది. అలా నవ్వించి చెప్పినప్పుడు ఆ విషయాన్ని ప్రేక్షకులు మరింత

Updated : 03 Sep 2021 07:43 IST

‘‘ప్రతి సినిమాలోనూ వినోదం ఉండటాన్ని నేను ఇష్టపడతాను. ఒక విషయం చెప్పాలిఅనుకున్నప్పుడు నవ్వించి చెప్తే తప్పేముంది అనిపిస్తుంది. అలా నవ్వించి చెప్పినప్పుడు ఆ విషయాన్ని ప్రేక్షకులు మరింత ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు’’ అన్నారు అవసరాల శ్రీనివాస్‌. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘నూటొక్క జిల్లాల అందగాడు’. రాచకొండ విద్యాసాగర్‌ దర్శకుడు. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్భంగా గురువారం శ్రీనివాస్‌ హైదరాబాద్‌లో విలేకర్లతో మాట్లాడుతూ ‘‘మన సమాజంలో బాడీ షేమింగ్‌ అన్నది ఎప్పటి నుంచో ఉంది. అది ఎంతోమంది ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తోంది. అందుకే ఇలాంటి అంశంపై ఓ కథ చెప్పాలి అన్న ఉద్దేశంతో ఈ సినిమా చేశాం. ఈ చిత్రంలో నేను బట్టతల సమస్యతో ఇబ్బంది పడే గొత్తి సూర్యనారాయణ అనే పాత్రలో కనిపిస్తా. నేను ఈ కథ రాసుకున్నప్పుడు తొలుత ‘అందమే ఆనందం’ అనే టైటిల్‌ అనుకున్నా. కానీ ‘నూటొక్క జిల్లాల అందగాడు’ అన్న పేరే క్రిష్‌కి బాగా నచ్చింది. దీంతో ఆ పేరే ఖరారు చేశాం. ఈ చిత్రంలో ఎవరినీ కించపరచలేదు. ఈ సినిమా చూశాక ఎవరైనా పక్కవారిని ఇంకా కామెడీ చేస్తే.. సినిమా సక్సెస్‌ అయినా.. ఫెయిల్యూర్‌ అన్నట్టే’’ అని చెప్పారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని