‘ఖుష్బూ రోడ్డు ప్రమాదంలో ఎన్నో లొసుగులు’

ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఓ తమిళ కార్టూనిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం నిజంగా జరగలేదని, కల్పితమని సదరు కార్టూనిస్ట్‌ ఖుష్బును....

Published : 21 Nov 2020 01:55 IST

కార్టూనిస్ట్‌ వ్యాఖ్యలు.. నటి కౌంటర్‌

చెన్నై: ప్రముఖ నటి, రాజకీయ నాయకురాలు ఖుష్బూ ఓ తమిళ కార్టూనిస్ట్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కారు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఎటువంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. అయితే ఈ ప్రమాదం నిజంగా జరగలేదని, కల్పితమని సదరు కార్టూనిస్ట్‌ ఖుష్బూను తప్పుపడుతూ తమిళంలో ట్వీట్‌  చేశారు. ‘ఖుష్బూ గొప్ప నటి. ఈ ఫొటో దానికి సాక్ష్యం (ప్రమాదం జరిగిన తర్వాత తీసిన ఫొటో షేర్‌ చేస్తూ). దయచేసి ఉత్తమ స్క్రిప్టు కోసం ప్రయత్నించండి. ఈ ప్రమాదంలో ఎన్నో లొసుగులు ఉన్నాయి. కొన్ని ఫొటోల్లో ఖుష్బూ ముందు సీటులో కూర్చొని ఉన్నారు, మరికొన్నింటిలో వెనుక కనిపించారు’ అని పేర్కొన్నారు. ఆయన ట్వీట్‌ చూసిన ఖుష్బూ అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు సిగ్గుపడాలన్నారు.

‘నీకు ధైర్యం ఉంటే ఫేక్‌ రోడ్డు ప్రమాదాన్ని సృష్టించేందుకు ప్రయత్నించు. చావు నీ ముఖంలో కనిపించిన ఆ క్షణం నువ్వు భయంతో వణికిపోతావు. ఎందుకంటే నాకున్న ధైర్యం నీకు లేదు. నువ్వు పిరికి వ్యాఖ్యలు చేస్తున్నావు. త్వరలో కోలుకోవాలని కోరుకుంటున్నా’ అంటూ ఖుష్బూ ఆయనకు కౌంటర్‌ ఇచ్చారు.

మరోపక్క తనకు జరిగిన రోడ్డు ప్రమాదంపై ఖుష్బూ అనుమానం వ్యక్తం చేశారు. ‘నేను బ్యాక్‌ ఇన్‌ యాక్షన్‌లోకి రావడం చూసి కొందరు ఆశ్చర్యానికి గురయ్యారు. కోట్లాది ప్రజల ప్రార్థనలు, ప్రేమ నాపై ఉన్నాయి కాబట్టి.. నేను బతికాను. నా కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు నాపక్క ఉన్నారు. దేవుడి ఆశీర్వాదాలు నాకున్నాయి. బెటర్‌ లక్‌ నెక్ట్స్‌ టైమ్‌’ అని పరోక్షంగా తన ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని