ప్రొడెక్షన్‌ బాయ్‌గా ఉన్నప్పుడే ఐష్‌ని చూశా

ప్రొడెక్షన్‌ బాయ్‌గా ఉన్నప్పుడే మొట్టమొదటిసారి తాను ఐశ్వర్య రాయ్‌ని కలిశానని ఆమె భర్త, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ తెలిపారు. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న అభిషేక్‌-ఐష్‌ 14 సంవత్సరాల క్రితం పెద్దల అంగీకారంతో....

Published : 22 Apr 2021 15:17 IST

అభిషేక్‌ బచ్చన్‌

ముంబయి: ప్రొడెక్షన్‌ బాయ్‌గా ఉన్నప్పుడే మొట్టమొదటిసారి తాను ఐశ్వర్య రాయ్‌ని కలిశానని ఆమె భర్త, బాలీవుడ్‌ నటుడు అభిషేక్‌ బచ్చన్‌ తెలిపారు. బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌గా పేరు తెచ్చుకున్న అభిషేక్‌-ఐష్‌ 14 సంవత్సరాల క్రితం పెద్దల అంగీకారంతో వివాహబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తాజాగా అభిషేక్‌ బచ్చన్‌ తమ ప్రేమకథ ఎలా మొదలైంది.., ఐష్‌ని తాను మొదటిసారి ఎప్పుడు కలిశారో ఓ ఇంటర్వ్యూలో తెలియజేశారు.

‘మా నాన్న అమితాబ్‌ బచ్చన్‌ కథానాయకుడిగా నటించిన ‘మృత్యుదాత’ చిత్రానికి నేను ప్రొడెక్షన్‌ బాయ్‌గా పనిచేశాను. ఆ సినిమాలోని ఎక్కువ సన్నివేశాలను న్యూజిలాండ్‌లో చిత్రీకరించాలని చిత్రబృందం భావించింది. చిన్నప్పటి నుంచి నేను ఆ దేశంలోనే చదువుకుంటూ ఉండడంతో ఓసారి ఆ టీమ్‌ నన్ను సంప్రదించింది. ‘మృత్యుదాత’ సినిమాకు కావాల్సిన అందమైన లొకేషన్స్‌ని వెతికిపెట్టమని చెప్పింది. దాంతో నేను కొంతకాలంపాటు అక్కడే ఒంటరిగా ఉన్నాను. అదే సమయంలో నా చిన్ననాటి స్నేహితుడు బాబీ డియోల్‌ ఆ దేశంలో తన మొదటి చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. నేను కూడా న్యూజిలాండ్‌లోనే ఉన్నానని తెలుసుకున్న బాబీ ఓసారి ఫోన్‌ చేసి డిన్నర్‌కి రమ్మని పిలిచాడు. డిన్నర్‌కి వెళ్లినప్పుడు బాబీ.. నాకు ఐశ్వర్యని పరిచయం చేశాడు. తాను తెరకెక్కిస్తున్న చిత్రంలో ఆమే కథానాయిక అని చెప్పాడు. అలా మొదటిసారి నేను - ఐష్‌ కలుసుకున్నాం. మాట్లాడుకున్నాం. తర్వాత కొన్నాళ్లకు స్నేహం.. ప్రేమ.. పెళ్లి జరిగింది’ అని అభిషేక్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని