LCU: లోకేశ్‌ కనగరాజ్‌ షార్ట్‌ఫిల్మ్‌.. ‘ఖైదీ’ ప్రీక్వెల్‌..!

దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ ఓ షార్ట్‌ఫిల్మ్‌ చిత్రీకరించారని నటుడు నరైన్‌ తెలిపారు. తన కొత్త సినిమా ప్రచారంలో భాగంగా ఆయన ఈ అప్‌డేట్‌ ఇచ్చారు.

Published : 14 Dec 2023 01:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఖైదీ’ (Kaithi) చిత్రంతో అటు కోలీవుడ్‌, ఇటు టాలీవుడ్‌లో విశేష క్రేజ్‌ సంపాదించుకున్న దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌ (Lokesh Kanagaraj). ఈ సినిమా సీక్వెల్‌ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నటుడు నరైన్‌ (Narain) ఓ అప్‌డేట్‌ ఇచ్చారు. తన కొత్త సినిమా ‘క్వీన్‌ ఎలిజబెత్‌’ ప్రచారంలో భాగంగా చెన్నైలోని ఓ కాలేజీ విద్యార్థులతో ఆయన ముచ్చటించారు. ‘ఖైదీ 2’ (Kaithi 2) గురించి అప్‌డేట్‌ ఇవ్వాలని స్టూడెంట్స్‌ కోరగా.. ఆయన ఇప్పటి వరకూ ఎవరూ గెస్‌ చేయని విషయాన్ని బయటపెట్టారు. తాను, లోకేశ్‌ కనగరాజ్‌ కలిసి ‘లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌’కి సంబంధించి షార్ట్‌ ఫిల్మ్‌ పూర్తిచేశామని తెలిపారు. అది ‘ఖైదీ’కి ప్రీక్వెల్‌గా (ఖైదీ సినిమాకి ముందు జరిగే కథ) (Kaithi Prequel) ఉంటుందని పేర్కొన్నారు. రజనీకాంత్‌తో తీయబోయే సినిమా పనుల్లో లోకేశ్ ప్రస్తుతం బిజీగా ఉన్నారని, అది పూర్తయిన తర్వాత ‘ఖైదీ 2’ మొదలవుతుందని చెప్పారు. లోకేశ్‌.. ‘ఖైదీ’ చిత్రంతో సినిమాటిక్‌ యూనివర్స్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ‘విక్రమ్‌’, ‘లియో’ చిత్రాలు ఆ యూనివర్స్‌లో భాగమే. వాటిలో.. ‘ఖైదీ’, ‘విక్రమ్‌’లో నటించి మెప్పించారు నరైన్‌.

లోకేశ్‌ కనగరాజ్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

లోకేశ్‌ ఇటీవల నిర్మాతగా మారారు. జి- స్క్వాడ్‌ నిర్మాణ సంస్థపై ఆయన నిర్మిస్తున్న తొలి చిత్రం ‘ఫైట్‌ క్లబ్‌’ (Fight Club). ఈ తమిళ సినిమా త్వరలోనే విడుదల కానుంది. మరోవైపు, రజనీకాంత్‌తో ‘జై భీమ్‌’ దర్శకుడు ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇది పూర్తయిన తర్వాత రజనీ.. లోకేశ్‌ డైరెక్షన్‌లో నటిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని