Agent: ‘ఏజెంట్‌’ విన్యాసం

అఖిల్‌ అక్కినేని కథానాయకుడిగా నటించిన ‘ఏజెంట్‌’ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది.

Updated : 17 Apr 2023 06:55 IST

ఖిల్‌ అక్కినేని (Akhil) కథానాయకుడిగా నటించిన ‘ఏజెంట్‌’ (Agent) ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం ప్రచార కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగానే విజయవాడలో ఓ భారీ పోస్టర్‌ని ఆవిష్కరించారు. ఆ పోస్టర్‌లో అఖిల్‌ కండలు తిరిగిన దేహంతో కనిపించారు. పోస్టర్‌ ఆవిష్కరణ సందర్భంగా అఖిల్‌ అక్కినేని 172 అడుగుల ఎత్తు నుంచి తాడు సాయంతో చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ట్రైలర్‌, సినిమా కూడా ఇంతే సాహసోపేతంగా ఉంటుందని... ఈ నెల 18న ట్రైలర్‌ని కాకినాడలో విడుదల చేస్తామని తెలిపారు. సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో అఖిల్‌కి జోడీగా సాక్షి వైద్య నటించారు. మమ్ముట్టి కీలకపాత్ర పోషించారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని