Alia Bhatt: పుస్తకాలు తిరగేస్తూ..

కథానాయికలు ఎప్పుడైనా కథలు వింటారు.. అవి నచ్చితే కొత్త సినిమాలకు ఓకే చెబుతారు గానీ.. ఈ చదవడమేంటి? అంటారా? తల్లిగా, నటిగా.. రెండు పాత్రల్ని సమర్థంగా పోషిస్తున్న అలియా భట్‌.. తన కూతురి కోసం క్రమం తప్పకుండా నీతి కథలు చదువుతున్నానంటోంది.

Updated : 17 Apr 2023 07:08 IST

థానాయికలు ఎప్పుడైనా కథలు వింటారు.. అవి నచ్చితే కొత్త సినిమాలకు ఓకే చెబుతారు గానీ.. ఈ చదవడమేంటి? అంటారా? తల్లిగా, నటిగా.. రెండు పాత్రల్ని సమర్థంగా పోషిస్తున్న అలియా భట్‌ (Alia Bhatt).. తన కూతురి కోసం క్రమం తప్పకుండా నీతి కథలు చదువుతున్నానంటోంది. అందుకు సంబంధించిన కొన్ని పుస్తకాల ఫొటోల్ని ఆదివారం తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది. కూతురు రాహా పెరిగి పెద్దయ్యాక వినిపించడానికే తను ప్రతి ఆదివారం ఇలాంటి పుస్తకాలు చదువుతోందట. ప్రస్తుతం ఆమె రణ్‌వీర్‌సింగ్‌తో కలిసి నటించిన ‘రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ’ నిర్మాణానంతర కార్యక్రమాల్లో ఉండగా.. మరో కొత్త సినిమా పట్టాలెక్కే పనుల్లో ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని