Kareena Kapoor Khan: యూనిసెఫ్‌ ఇండియా ప్రచారకర్తగా కరీనా

ఐక్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్‌ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్‌ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు.

Updated : 05 May 2024 09:54 IST

క్యరాజ్య సమితికి అనుబంధ సంస్థ అయిన యూనిసెఫ్‌ ఇండియా తన కొత్త జాతీయ ప్రచారకర్తగా బాలీవుడ్‌ కథానాయిక కరీనా కపూర్‌ను నియమించినట్లు శనివారం ప్రకటించింది. ‘‘బాలీవుడ్‌ ప్రముఖ కథానాయిక కరీనా కపూర్‌ ఎన్నో జాతీయ ప్రచారాలకు, కార్యక్రమాలకు మద్దతుగా నిలిచారు. ఇప్పుడు యూనిసెఫ్‌ ఇండియా జాతీయ అంబాసిడర్‌గా ఎంపికైన ఆమెతో కలిసి పిల్లల హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాము’’ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ..‘‘పిల్లల హక్కులు, భవిష్యత్తు తరం ముఖ్యంగా విద్య, లింగ సమానత్వం లాంటి తదితర ముఖ్యమైన అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పుడు అంబాసిడర్‌గా యూనిసెఫ్‌తో నా అనుబంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్తున్నందుకు గర్వంగా ఉంది. బలహీన వర్గాలకు చెందిన పిల్లల హక్కులను రక్షించడం, వారికి గొప్ప భవిష్యత్తును అందించడం కోసం నా వంతు కృషి చేస్తాను’’ని వ్యాఖ్యల్ని జోడించింది. 2014 నుంచి ఈ సంస్థతో అనుబంధం ఉన్న కరీనా.. ఇంతకు ముందు యూనిసెఫ్‌కు సెలబ్రెటీ అడ్వకెట్‌గా పనిచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని