RGV: ఆనాటి వర్మ కనిపించారు

పూజా భాలేకర్‌ ప్రధాన పాత్రలో రామ్‌గోపాల్‌ వర్మ తెరకెక్కించిన మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రం ‘అమ్మాయి’. ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు.

Updated : 15 Jul 2022 08:21 IST

పూజా భాలేకర్‌(Pooja Bhalekar) ప్రధాన పాత్రలో రామ్‌గోపాల్‌ వర్మ(Ramgopal Varma) తెరకెక్కించిన మార్షల్‌ ఆర్ట్స్‌ చిత్రం ‘అమ్మాయి’ (Ammayi). ఈ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ సందర్భంగా ఇటీవల హైదరాబాద్‌లో విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. ప్రముఖ రచయిత విజయేంద్ర ప్రసాద్‌(Vijayendra Prasad), సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani) ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విజయేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ.. ‘‘పది నెలల క్రితం ‘కనబడుటలేదు’ చిత్ర పాటల వేడుకకు వెళ్లా. దానికి వర్మ కూడా వచ్చారు. పదిహేనేళ్లుగా నాలో గూడు కట్టుకున్న కోపం, చిరాకు, అసహ్యం, బాధ అన్నీ కలగలిపి ఆరోజు స్టేజీపై ఆయన్ని కొన్ని మాటలన్నా. ‘‘శివ’ సినిమాతో నాతోపాటు వందల మంది రచయితలు, టెక్నీషియన్లు, దర్శకులు ప్రేరణ పొంది పరిశ్రమలోకి వచ్చారు. కానీ, ఆనాటి వర్మ కనిపించడం లేదు. మీకేమైనా కనిపిస్తే మళ్లీ అలాంటి చిత్రం తీయమని చెప్పండి’ అన్నాను. ఇప్పుడు ‘అమ్మాయి’ చూశాక గర్వంగా చెబుతున్నా. రాములోని ఆనాటి డైరెక్టర్‌ మళ్లీ కనిపించారు. ‘శివ’ కంటే వందింతలు ఎక్కువ కనిపించారు. ఈ సినిమా 40 వేల థియేటర్లలో విడుదలవుతోందంటే నిజంగా అద్భుతమైన విషయం. ఇది తెలుగు వారందరికీ గర్వకారణం’’ అన్నారు. ‘‘నేనెంతో ఎమోషనల్‌ అయ్యి తీసిన సినిమా ఇది. 40 ఏళ్లు అయినా మనం బ్రూస్లీ ఫైట్స్‌ ఎందుకు మరచిపోలేకపోతున్నాము అని స్టడీ చేసి ఈ చిత్రం తీశాను’’ అన్నారు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ. కార్యక్రమంలో టి.అంజయ్య, మధు మంతెన, పూజ, కోన వెంకట్‌, రవి తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని