అనుష్క కథకి హంగులు

అగ్ర కథానాయిక అనుష్క తదుపరి చిత్రంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇప్పటికే ఆమె యు.వి.క్రియేషన్స్‌లో ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఆ కథకే ఇప్పుడు మరిన్ని హంగులు అద్దుతున్నట్టు సమాచారం.....

Published : 17 Mar 2021 11:19 IST

హైదరాబాద్‌: అగ్ర కథానాయిక అనుష్క తదుపరి చిత్రంపై ఇంకా స్పష్టత రాలేదు. కానీ ఇప్పటికే ఆమె యు.వి.క్రియేషన్స్‌లో ఓ సినిమాకి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. ఆ కథకే ఇప్పుడు మరిన్ని హంగులు అద్దుతున్నట్టు సమాచారం. ఒక యువ దర్శకుడు తెరకెక్కించనున్న ఈ చిత్రంలో యువ కథానాయకుడు నవీన్‌ పొలిశెట్టి ఓ కీలక పాత్ర చేస్తారని తెలుస్తోంది. ఆయన పాత్రని దృష్టిలో ఉంచుకుని కథలో మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయని సమాచారం. త్వరలోనే ఈ చిత్రాన్ని పట్టాలెక్కించే అవకాశాలున్నాయి. అనుష్క ‘నిశ్శబ్దం’ తర్వాత మళ్లీ సినిమా చేయలేదు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని