Deepika padukone: హాలీవుడ్‌లో దీపికా పదుకొణె రెండో చిత్రం

ఈసినిమాకి దీపిక హీరోయిన్‌ మాత్రమే కాదు. సహ నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం.  ఇలా రెండు బాధ్యతలను తన భుజాల మీద వేసుకున్నామె మాట్లాడుతూ..‘‘ నా బ్యానర్‌ కేఏ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈచిత్రానికి సహ నిర్మాతగా మీ ముందుకు వస్తున్నా.

Published : 31 Aug 2021 18:48 IST

ముంబయి: బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె తన రెండో హాలీవుడ్‌ చిత్రం గురించి ప్రకటించారు. రొమాంటిక్‌ కామెడీ జానర్‌లో రాబోయే ఈచిత్రాన్ని ఈరోస్‌ ఎస్టీఎక్స్‌ గ్లోబల్ కార్పొరేషన్స్‌ నిర్మిస్తుంది. ఈసినిమాకి దీపిక హీరోయిన్‌ మాత్రమే కాదు. సహ నిర్మాతగానూ వ్యవహరిస్తుండటం విశేషం. ‘‘ నా బ్యానర్‌ కేఏ ప్రొడక్షన్స్‌ ద్వారా ఈ చిత్రానికి సహ నిర్మాతగా మీ ముందుకు వస్తున్నా. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఉపయోగపడే, ప్రభావం చూపే, సృజనాత్మక చిత్రాలను అందించాలనదే కేఏ ప్రొడక్షన్స్‌ లక్ష్యం. ఈచిత్రం ద్వారా మేము.. ఎస్టీక్స్‌, టెంపుల్‌ హిల్‌ ప్రొడక్షన్స్ తో  అనుసంధానం అవ్వడం థ్రిల్లింగ్‌గా ఉంది.’’ అంటూ చెప్పుకొచ్చింది. 2017లో వచ్చిన ‘‘XXX: Return of Xander Cage’’ అనే చిత్రంలో హాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ పొడుగుకాళ్ల సుందరి. విన్‌ డీజిల్‌ హీరోగా నటించిన ఈచిత్రం..సైన్స్‌ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. కాగా 2020లో విడుదలైన ఛపాక్‌ చిత్రంతో నిర్మాతగా మారింది దీపిక.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని