em chesthunnav: హాయైన వినోదంతో ‘ఏం చేస్తున్నావ్‌’

కథాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్‌ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్‌’ చేరింది.

Updated : 26 Apr 2024 11:50 IST

థాబలం ఉన్న సినిమాలతో ఈటీవీ విన్‌ ప్రేక్షకులకు పసందైన వినోదాన్ని పంచుతోంది. ‘#90s’ మొదలుకొని వినూత్నమైన సినిమాలు వరుసగా ఈ వేదికలో సందడి చేస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి ‘ఏం చేస్తున్నావ్‌’ చేరింది. విజయ్‌ రాజ్‌కుమార్‌, నేహా పతన్‌, అమితా రంగనాథ్‌, ఆమని, రాజీవ్‌ కనకాల కీలక పాత్రలు పోషించిన చిత్రమిది. భారత్‌మిత్ర దర్శకత్వం వహించారు. నవీన్‌ కురువ, కిరణ్‌ కురువ నిర్మాతలు. గోపీసుందర్‌ స్వరాలు సమకూర్చారు. ఇటీవలే ఈటీవీ విన్‌ వేదిక ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రానికి విశేష ఆదరణ లభిస్తోందని దర్శకుడు తెలిపారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘‘యువతరానికి నచ్చే అంశాలతో రూపుదిద్దుకున్న చిత్రమిది. విద్యార్థులు, ఉద్యోగాన్వేషణలో ఉన్న యువకులు ఈ కథకి బాగా కనెక్ట్‌ అయ్యార’’న్నారు. ఈటీవీ విన్‌ మార్కెటింగ్‌ హెడ్‌ నితిన్‌ మాట్లాడుతూ

‘‘కుటుంబం మొత్తం కలిసి చూడతగ్గ సినిమా ఇది. ఈ వేసవిలో హాయైన వినోదాన్ని పంచుతుంది’’ అన్నారు. ఈటీవీ విన్‌ బిజినెస్‌ హెడ్‌ సాయికృష్ణ మాట్లాడుతూ ‘‘రోజూ మనం చూసే మన పక్కింటివాళ్లు, మన చుట్టాలు ఇందులో కనిపిస్తారు. భారత్‌ అలా ప్రతి ఒక్కరూ కనెక్ట్‌ అయ్యేలా ఈ కథని రచించి తెరకెక్కించారు. అందుకే ఇంత మంచి విజయాన్ని అందుకుంది’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని