Sreeleela: అజిత్‌ సరసన శ్రీలీల?

అగ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్‌ హీరో అజిత్‌తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం.

Updated : 26 Apr 2024 11:42 IST

గ్ర కథానాయకులతో వరుసగా జట్టు కడుతున్న శ్రీలీల.. ఈసారి తమిళ టాప్‌ హీరో అజిత్‌తో ఆడిపాడటానికి సిద్ధమవుతోంది. ‘గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ’ అనే చిత్రంలో ఆయన సరసన నటించనుందని సమాచారం. అధిక్‌ రవిచంద్రన్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అజిత్‌ త్రిపాత్రాభినయం చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీలీలది ముఖ్య కథానాయిక పాత్ర అని సన్నిహితవర్గాలు తెలిపాయి. అయితే దీన్ని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూర్చే ఈ చిత్రం జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని