Sonakshi Sinha: ఇన్నాళ్లకు కల నెరవేరింది

‘విలన్‌ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్‌ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’తో నా కల నెరవేరింది.

Updated : 26 Apr 2024 11:56 IST

‘విలన్‌ పాత్రలు చేయాలని ఎప్పట్నుంచో నా కోరిక. మా నాన్న శత్రుఘ్నసిన్హా కెరీర్‌ తొలినాళ్లలో ప్రతినాయకుడిగానే మెప్పించారు. ఇన్నాళ్లకు ‘హీరామండి: ది డైమండ్‌ బజార్‌’తో నా కల నెరవేరింది. ప్రస్తుతం నేనెంతో సంతోషంతో ఉన్నా’నంటోంది సోనాక్షి సిన్హా. వైవిధ్యమైన చిత్రాలు, సిరీస్‌లతో ముందుకెళ్తున్న సోనాక్షి సిన్హా.. సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కించిన ఈ వెబ్‌సిరీస్‌లో ఫరీదాన్‌ అనే పాత్రలో నటించింది. గురువారం ఓ ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘మంచి, విలక్షణమైన పాత్రలు పోషించాలనేదే నా ఏకైక నియమం. కొన్నేళ్లుగా అదే పాటిస్తున్నా. శక్తిమంతమైన మహిళ.. నటనకు ప్రాధాన్యం ఉన్న ప్రాజెక్టులే ఎంచుకుంటున్నా. ఇటీవలే విడుదలైన ‘హీరామండి’లో నా పాత్ర ప్రేక్షకుల మనసులపై బలమైన ముద్ర వేసేలా, చాలాకాలం గుర్తుంచుకునేలా ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన సంజయ్‌ సర్‌కి కృతజ్ఞతలు’ అంటూ ఆనందం వ్యక్తం చేసింది. ‘ఒకేరకమైన రోల్స్‌ చేసుకుంటూ వెళ్తే మూసగా ఉండదా?’ అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. ‘ఇది ఓటీటీ యుగం. విషయం ఉంటే ఎలాంటి కంటెంట్‌తో అయినా ప్రయోగాలు చేయొచ్చు. నటులు, దర్శకులు, రచయితలు, క్రియేటర్లు... హద్దుల్లేనంత ప్రతిభ ప్రదర్శించొచ్చు. మూస ధోరణిలో వెళ్లడం నాకు నచ్చదు. వెళ్లను కూడా. గతంలో ఏవైనా తప్పులు చేస్తే.. వాటిని సరిదిద్దుకుంటూ మంచి పాత్రలు మాత్రమే ఎంచుకుంటా’ అంటూ ముగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని