Dhanush: మరోసారి రాజకీయ నాయకుడిగా?

అభిమానులను భిన్నమైన కథలతో అలరించే నటులలో ధనుష్‌ ఒకరు.  పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆయన స్వీయ దర్శకత్వంలో రానున్న ‘డీ50’(వర్కింగ్‌ టైటిల్‌) తర్వాత శేఖర్‌ కమ్ములతో ‘డీ51’గా ఓ సినిమాను పట్టాలెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ కలయికలో సినిమా ఖరారైనప్పటి నుంచి ఎన్నో వార్తలు వచ్చాయి.

Updated : 03 Sep 2023 13:58 IST

భిమానులను భిన్నమైన కథలతో అలరించే నటులలో ధనుష్‌ ఒకరు.  పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారాయన. ఆయన స్వీయ దర్శకత్వంలో రానున్న ‘డీ50’(వర్కింగ్‌ టైటిల్‌) తర్వాత శేఖర్‌ కమ్ములతో ‘డీ51’గా ఓ సినిమాను పట్టాలెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ కలయికలో సినిమా ఖరారైనప్పటి నుంచి ఎన్నో వార్తలు వచ్చాయి. నాగార్జున, రష్మిక కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రం పొలిటికల్‌ డ్రామాగా వస్తున్నట్లు సమాచారం. 40ఏళ్ల క్రితం జరిగిన రాజకీయ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించనున్నట్లు తెలుస్తోంది. పాన్‌ ఇండియా చిత్రంగా అభిమానుల ముందుకు రానున్న ఈ సినిమాను ‘డీ50’ చిత్రీకరణ పూర్తికాగానే సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని