Mannara Chopra: ముద్దు వివాదం.. అందులో తప్పేముందన్న దర్శకుడు..!

నటి మన్నారా చోప్రా(Mannara Chopra)కు ముద్దు పెట్టడంపై స్పందించారు దర్శకుడు రవికుమార్‌. తనకు ఎలాంటి దురుద్దేశం లేదని చెప్పారు.

Published : 30 Aug 2023 14:16 IST

హైదరాబాద్‌: టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో నటి మన్నారా చోప్రా (Mannara Chopra)ను దర్శకుడు ఎ.ఎస్‌. రవికుమార్‌ (Ravikumar) ముద్దుపెట్టుకోవడం నెట్టింట చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వివాదంపై తాజాగా రవికుమార్‌ స్పందించారు. ఆ చర్య వెనుక ఎలాంటి దురుద్దేశం లేదన్నారు. ‘‘ఆమెను ముద్దు పెట్టుకుంటే తప్పేంటి..? ఆప్యాయతతోనే అలానే చేశా. నా కుమార్తెను కూడా అలాగే ముద్దుపెట్టుకుంటా. ఆ నటికి, నా కుటుంబానికి లేని ఇబ్బంది మిగతావాళ్లకు ఎందుకు? నా సినిమా కోసం ఆమె ఎంతో కష్టపడి వర్క్‌ చేశారు. ఆమె వర్క్‌ నచ్చడంతో కృతజ్ఞతగా ముద్దు పెట్టా’’ అని తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరణ ఇచ్చారు.

రక్షాబంధన్‌ స్పెషల్‌.. సూపర్‌హిట్‌ చిత్రం బంపర్‌ ఆఫర్‌

‘పిల్లా నువ్వు లేని జీవితం’, ‘ఆటాడిస్తా’, ‘సౌఖ్యం’, ‘వీరభద్ర’ వంటి చిత్రాలతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రవికుమార్‌. తాజాగా ఆయన తెరకెక్కించిన చిత్రం ‘తిరగబడరసామీ’. రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్రా, మన్నారా చోప్రా ప్రధాన పాత్రల్లో నటించారు. యాక్షన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్‌ విడుదల కార్యక్రమం ఇటీవల జరిగింది. ఈ సందర్భంగా ఫొటోలకు పోజిచ్చే సమయంలో మన్నారా పక్కనే ఉన్న రవికుమార్‌ ఆమెపై చేయి వేసి.. బుగ్గపై ముద్దు పెట్టారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌మీడియాతో పాటు ఆంగ్ల వెబ్‌సైట్స్‌లోనూ వైరల్‌గా మారాయి. రవికుమార్‌ను తప్పుబడుతూ పలువురు కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్‌ నటి ప్రియాంకా చోప్రాకు మన్నారా బంధువు అనే విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని