Mangalavaram: గణ గణ మోగాలిరా..

పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం... ‘మంగళవారం’. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేశ్‌ వర్మ.ఎం నిర్మిస్తున్నారు.

Updated : 17 Aug 2023 14:59 IST

పాయల్‌ రాజ్‌పూత్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం... ‘మంగళవారం’. అజయ్‌ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతిరెడ్డి గునుపాటి, సురేశ్‌ వర్మ.ఎం నిర్మిస్తున్నారు. ఈ చిత్రం లోని జాతర నేపథ్యంలో సాగే ‘గణగణ మోగాలిరా...’ పాటని బుధవారం విడుదల చేశారు. అజనీష్‌ లోక్‌నాథ్‌ స్వరకల్పనలోని ఈ గీతానికి భాస్కరభట్ల సాహిత్యం అందించగా, వి.ఎం.మహాలింగం ఆలపించారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కథలో కీలక సందర్భంలో వచ్చే పాట ఇది. ఇందులోని పాటలూ కథని చెబుతాయి. త్వరలోనే ట్రైలర్‌, సినిమా విడుదల తేదీని వెల్లడిస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘గ్రామీణ నేపథ్యంలో తెలుగుదనం ఉట్టిపడే కథతో తెరకెక్కిస్తున్న చిత్రమిది. విభిన్నమైన యాక్షన్‌ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల మనసుల్ని గెలుస్తుంద’’న్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని