Venkatesh: ‘నారప్ప’ విడుదల ఓటీటీలో

థియేటర్‌లోనా లేక ఓటీటీ వేదికల్లోనా అనే ఉత్కంఠకి తెరదించుతూ ‘నారప్ప’ విడుదల విషయాన్ని ఖరారు చేసింది ఆ  చిత్రబృందం. కొన్ని రోజులుగా వినిపిస్తున్నట్టుగానే ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ఈ నెల 20న సినిమాని విడుదల చేయాలని...

Updated : 13 Jul 2021 06:01 IST

థియేటర్‌లోనా లేక ఓటీటీ వేదికల్లోనా అనే ఉత్కంఠకి తెరదించుతూ ‘నారప్ప’ విడుదల విషయాన్ని ఖరారు చేసింది ఆ  చిత్రబృందం. కొన్ని రోజులుగా వినిపిస్తున్నట్టుగానే ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో ద్వారా ఈ నెల 20న సినిమాని విడుదల చేయాలని నిర్ణయించారు. రెండో దశ కరోనా తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్న తొలి అగ్ర కథానాయకుడి సినిమా ఇదే. కరోనాతో మూతపడిన థియేటర్లని పునః ప్రారంభించుకోవచ్చని రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే అనుమతులు ఇచ్చేశాయి. అయితే ఆ రంగంలో నెలకొన్న సమస్యల వల్ల ఇంకా థియేటర్ల తలుపులు తెరుచుకోలేదు. దాంతో విడుదలకి సిద్ధమైన సినిమాలు ఓటీటీ బాట పట్టేందుకు సిద్ధమయ్యాయి. అగ్ర కథానాయకుడు వెంకటేష్‌ నటించిన ‘నారప్ప’ దారెటు అని పరిశ్రమ వర్గాలతో పాటు ప్రేక్షకులు ఆసక్తిగా చూశారు. ‘నారప్ప’ ఓటీటీనే ఎంచుకున్నాడు. తమిళంలో విజయవంతమైన ‘అసురన్‌’కి రీమేక్‌గా... దర్శకుడు శ్రీకాంత్‌ అడ్డాల తెరకెక్కించిన  చిత్రమిది. వెంకటేష్‌కి జోడీగా ప్రియమణి నటించారు. డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌.థాను నిర్మాతలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని