Raviteja: తొలి పాటతో రావణాసుర

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరు మీదున్నారు రవితేజ(Raviteja). ఇప్పుడీ ఉత్సాహంలోనే ‘రావణాసుర’(Ravanasura)గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు.

Updated : 30 Jan 2023 07:17 IST

‘ధమాకా’, ‘వాల్తేరు వీరయ్య’ విజయాలతో జోరు మీదున్నారు రవితేజ (Raviteja). ఇప్పుడీ ఉత్సాహంలోనే ‘రావణాసుర’(Ravanasura)గా అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్‌వర్మ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌, అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ  నేపథ్యంలో ప్రచార పర్వాన్ని వేగవంతం చేస్తోంది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఫిబ్రవరి 5న తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ముస్తాబవుతున్న ఈ సినిమాలో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు. సుశాంత్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అనూ ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని