Rashmika: ‘సికందర్‌’ సరసన రష్మిక

త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక.

Updated : 10 May 2024 09:53 IST

త్వరలో ‘పుష్ప 2’తో శ్రీవల్లిగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది అందాల తార రష్మిక. కథల ఎంపికలో ప్రత్యేకతను చూపించే ఈ భామ.. ఇప్పుడు మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. బాలీవుడ్‌ అగ్రకథానాయకుడు సల్మాన్‌ ఖాన్‌ ‘సికందర్‌’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా రష్మికను ఎంపిక చేసినట్లు ప్రకటించింది చిత్రబృందం. తమిళ దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్‌ పెట్టింది రష్మిక. ‘‘ఎన్నో రోజుల నుంచి నా తదుపరి సినిమాల విశేషాల గురించి మీరు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మీ కోసమే ఈ సర్‌ప్రైజ్‌. ‘సికందర్‌’తో త్వరలో మీ ముందుకు రాబోతున్నాను. ఇంత గొప్ప ప్రాజెక్టులో నేను భాగమయినందుకు గర్వంగా ఉంది’’ అని చెప్పుకొచ్చింది. భావోద్వేగాలతో కూడిన ఈ యాక్షన్‌ చిత్రాన్ని సాజిద్‌ నడియాడ్‌వాలా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణను ఇప్పటికే ప్రారంభించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ‘రెయిన్‌ బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘కుబేర’ చిత్రాలతో బిజీగా ఉంది రష్మిక.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని