Sandeep kishan: మాయావన్‌లో పోరు

సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘మాయావన్‌’.

Updated : 10 May 2024 10:04 IST

సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్న సైన్స్‌ ఫిక్షన్‌ చిత్రం ‘మాయావన్‌’. సి.వి.కుమార్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఆకాంక్ష రంజన్‌ కపూర్‌ కథానాయిక. నీల్‌ నితిన్‌ ముఖేష్‌, మురళీ శర్మ, అనీష్‌ కురువిల్లా తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర టీజర్‌ను గురువారం విడుదల చేశారు. సైన్స్‌ను గుప్పిట్లో పెట్టుకుని సూపర్‌ విలన్‌గా మారిన ఓ దుర్మార్గుడి ఆట కట్టించడానికి ఓ సామాన్యుడు ఏం చేశాడన్నది ఈ చిత్ర ఇతివృత్తం. దీన్నే టీజర్‌లో ఆసక్తికరంగా చూపించారు. మాయావన్‌ ప్రపంచం.. అందులోని పాత్రలు.. సూపర్‌ విలన్‌గా నీల్‌ నితిన్‌ కనిపించిన తీరు.. అతన్ని ఢీ కొట్టే సామాన్యుడిలా సందీప్‌ చేసిన యాక్షన్‌ హంగామా.. అన్నీ సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఆఖర్లో సందీప్‌ కూడా సూపర్‌ పవర్స్‌ ఉన్న చేతితో కనిపించడం ఆసక్తి రేకెత్తిస్తుంది. మరి ఈ సామాన్యుడికి సూపర్‌ విలన్‌కు మధ్య జరిగే పోరు ఎలా ఉండనుందో తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడక తప్పదు. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్‌ నారాయణన్‌, ఛాయాగ్రహణం: కార్తీక్‌ తిల్ల్చై, కవిన్‌ రాజ్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని