Jally LLB: మళ్లీ జాలీగా వచ్చేసింది పుష్ప

బాలీవుడ్‌లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు.

Updated : 10 May 2024 10:03 IST

బాలీవుడ్‌లో నవ్వులు పూయించిన చిత్రాలు ఎన్నో. అందులో ‘జాలీ ఎల్‌ఎల్‌బీ’ ఫ్రాంచైజీ సినిమాలు కూడా ఉన్నాయనడంలో సందేహం లేదు. ప్రస్తుతం ఆ ఫ్రాంచైజీలో భాగంగా ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 3’ తెరకెక్కుతోంది. అక్షయ్‌ కుమార్‌, అర్షద్‌ వార్షిలు కీలక పాత్రలు పోషించనున్నారు. కోర్టురూమ్‌ కామెడీ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రానికి సుభాష్‌ కపూర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. 2017లో వచ్చిన ‘జాలీ ఎల్‌ఎల్‌బీ 2’లో అక్షయ్‌ భార్య పుష్పా పాండే పాత్రలో కనిపించిన హ్యూమా ఖురేషీ ఇప్పుడీ మూడో భాగంలోనూ పుష్ప పాత్రలో సందడి చేయనుంది. ఆ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా ఫొటోల్ని పంచుకుంది. ‘పుష్పా పాండే మళ్లీ వచ్చింది’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ‘గులాబి’ చిత్రీకరణతో బిజీగా ఉంది హ్యూమా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు