Bhayyaji: భయ్యాజీ ప్రతీకారం
‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది.
‘భయ్యాజీ’.. ఎంతో ప్రేమగా చూసుకునే తన తమ్ముడిని చంపిన శత్రువులపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఓ సోదరుడు చేస్తున్న పోరాటం ఆధారంగా రూపొందిన చిత్రమిది. బాలీవుడ్ కథానాయకుడు మనోజ్ బాజ్పేయీ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రమిది. అపూర్వ సింగ్ కర్కి దీన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మనోజ్ యాక్షన్ అవతారంలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ‘‘ప్రతీకారం తీర్చుకోవడంలో ఈ భయ్యాజీది మాస్టర్ మైండ్’, ‘రాబిన్ హుడ్ కాదు.. రాబిన్ హుడ్ కా బాప్’’ లాంటి సంభాషణలతో ఆద్యంతం ఆసక్తిగా సాగుతోంది ఈ ట్రైలర్. ప్రతీకార నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కుటుంబ భావోద్వేగాలు ప్రధానాంశంగా ఉండనున్నట్లు తెలిపింది చిత్రబృందం. వినోద్ భనుషాలీ నిర్మిస్తున్న సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.
‘ఆరంభం’తో కొత్త తారలు పుట్టుకొస్తారు
మంచి కథ కుదిరితే ‘ఆరంభం’ బృందంతో కలిసి ఓ సినిమా చేస్తానన్నారు శ్రీవిష్ణు. ఈ సినిమాతో చాలా మంది కొత్త తారలు పుట్టుకొస్తారనీ, వాళ్లలో అంత ప్రతిభ వుందని చెప్పారు. ఆయన ముఖ్య అతిథిగా ఇటీవల హైదరాబాద్‌లో ‘ఆరంభం’ విడుదలకి ముందస్తు వేడుక జరిగింది. మోహన్ భగత్, సుప్రీత సత్యనారాయణ్, భూషణ్ కల్యాణ్, రవీంద్ర విజయ్ ప్రధాన పాత్రధారులుగా... అజయ్ నాగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది. అజయ్ నాగ్.వి దర్శకత్వం వహించారు. అభిషేక్.వి.టి నిర్మాత. ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. ఈ సందర్బంగా నిర్వహించిన వేడుకకి శ్రీవిష్ణుతోపాటు, మరో కథానాయకుడు తిరువీర్, దర్శకులు వెంకటేశ్ మహా, నవీన్ మేడారం, కథానాయిక శివానీ నాగారం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఆ హంతకుల్ని ఎలా పట్టుకున్నారు?
హత్యాచారానికి గురైన ఓ యువతి కేసుని దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారి ఎదుర్కొన్న సవాళ్లు ఎలాంటివి? దారుణానికి ఒడికట్టిన నిందితుల్ని ఆ అధికారి ఎలా పట్టుకున్నారు? అనేది తెలియాలంటే ‘సిట్’ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్) చూడాల్సిందే. పోలీసు అధికారి పాత్రలో అరవింద్ కృష్ణ నటించిన చిత్రమిది. రజత్ రాఘవ్, నటాషా దోషి ప్రధాన పాత్రలు పోషించారు. రుచిత సాధినేని, అనుక్ రాథోడ్, కౌశిక్ మేకల ఇతర పాత్రలు పోషించారు. నాగిరెడ్డి, తేజ్ పల్లి, గుంటక శ్రీనివాస్‌రెడ్డి నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని ఇటీవల హైదరాబాద్‌లో కథానాయకుడు విష్వక్సేన్ విడుదల చేశారు. ‘‘సస్పెన్స్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన సినిమా ఇది. నిజాయతీ గల పోలీసుగా అరవింద్ కృష్ణ ఆకట్టుకుంటారు. తర్వాత ఏం జరుగుతుందనే ఉత్సుకతని రేకెత్తిస్తూ మంచి వినోదాన్ని పంచుతుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.
తమిళ క్లైమాక్స్‌కు భిన్నంగా తెలుగులో!
‘‘సత్య’ అచ్చమైన తెలుగు సినిమాలా ఉంటుంది. తమిళ వెర్షన్ క్లైమాక్స్‌కు తెలుగు వెర్షన్ క్లైమాక్స్ పూర్తి భిన్నంగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత శివ మల్లాల. హమరేష్, ప్రార్థన జంటగా వాలి మోహన్ దాస్ తెరకెక్కించిన చిత్రమే ‘సత్య’. దీన్ని శివం మీడియా పతాకంపై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు నిర్మాత శివ. ఇది శుక్రవారం విడుదల కానున్న నేపథ్యంలో గురువారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత శివ మాట్లాడుతూ.. ‘‘తండ్రీకొడుకుల అనుబంధాల నేపథ్యంలో సాగే చిత్రమిది’’ అన్నారు.
ప్రేమా? ఆకర్షణా?
‘నిజమైన ప్రేమకు... ఆకర్షణకు తేడా తెలియకుండా యువతరం తీసుకునే నిర్ణయాలు వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలిపే కథతోనే మా చిత్రం రూపొందుతోంద’న్నారు శిరిన్ శ్రీరామ్. ఆయన దర్శకనిర్మాణంలో రూపొందుతున్న చిత్రం ‘ప్రేమించొద్దు’. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రధారులు. ఐదు భాషల్లో రూపొందిన ఈ సినిమాని జూన్ 7న తెలుగులో విడుదల చేస్తున్నట్టు సినీ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ‘‘బస్తీ నేపథ్యంలో సాగే ప్రేమకథా చిత్రమిది. యువతరం ఆలోచనల్ని ప్రతిబింబించే ఈ కథ, కథనాలు ప్రేక్షకులకు కొత్తదనాన్ని పంచుతాయి. వాస్తవ సంఘటనల స్ఫూర్తితో రూపొందిన ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. తెలుగులో విడుదలయ్యాక తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ తెలిపింది చిత్రబృందం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
Sanjay Bhansali: తన సినిమాల్లో వేశ్య పాత్రలు ఎక్కువగా ఎందుకు కనిపిస్తుంటాయో చెప్పుకొచ్చారు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ.. -
మగబిడ్డకు జన్మనిచ్చిన నటి యామీ గౌతమ్.. పేరేంటంటే
నటి యామీ గౌతమ్ మగబిడ్డకు జన్మినిచ్చారు. దీంతో నెటిజన్లు శుభాకాంక్షలు చెబుతున్నారు. -
‘మిరాయ్’ ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్.. ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ లుక్!
మంచు మనోజ్ (Manchu Manoj), తేజ సజ్జా (Teja Sajja) ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సూపర్ ఫ్యాంటసీ సినిమా ‘మిరాయ్’(Mirai). ‘ది సూపర్ యోధ’ అనేది ఉప శీర్షిక. కార్తిక్ ఘట్టమనేని దర్శకుడు. తాజాగా ఈ సినిమా నుంచి ‘ది బ్లాక్ స్వాడ్’ గ్లింప్స్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
‘బాహుబలి’ తీసేముందు గేయ రచయిత సీతారామశాస్త్రి సలహా తీసుకున్నట్లు రాజమౌళి చెప్పారు. -
బెంగళూరు రేవ్‌పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు: సినీనటి హేమ
బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీతో తనకు ఎలాంటి సంబంధం లేదని సినీ నటిహేమ స్పష్టం చేశారు. -
బ్యాన్ చేస్తామని బెదిరిస్తున్నారు.. లీగల్ యాక్షన్‌కు సిద్ధమైన పాయల్ రాజ్‌పుత్
తనను టాలీవుడ్ నుంచి బ్యాన్ చేస్తామని మూవీ టీమ్ బెదిరిస్తున్నట్లు పాయల్ రాజ్‌పుత్ తెలిపారు. -
ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది: ఎన్టీఆర్ గురించి ఈ సంగతులు తెలుసా?
ప్రముఖ నటుడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి కొన్ని ఆసక్తికర సంగతులు.. -
ఈ వారం థియేటర్/ఓటీటీలో అలరించే చిత్రాలివే!
గత కొన్ని వారాలుగా బాక్సాఫీస్ వద్ద చిన్న చిత్రాల హవా కొనసాగుతోంది. ఈ వారం కూడా పలు వైవిధ్య చిత్రాలు ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యాయి. -
కోపం రగిలితే.. మృత్యువుకైనా ముచ్చెమటే!
‘‘దూకే ధైర్యమ జాగ్రత్తా.. రాకే.. ఎగబడి రాకే.. దేవర ముంగిట నువ్వెంతే’’ అంటూ తన వీరత్వాన్ని పరిచయం చేస్తున్నారు ఎన్టీఆర్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాని కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు. -
తెలుగులో తొలి అడుగులు.. మెరిసేనా!
పాన్ ఇండియా సినిమాలకు చిరునామాగా నిలుస్తోంది తెలుగు చిత్రసీమ. కొన్నేళ్లుగా ఇక్కడి కథలకు, నటులకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. అందుకే ఇప్పుడు ఉత్తరాది తారలూ మన కథల్లో భాగమయ్యేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. -
ప్రపంచమంతా తెలుగు సినిమా వైపు చూస్తోంది
‘ఈరోజు ప్రపంచమంతా తెలుగు సినిమాల వైపు ఆసక్తిగా చూస్తోంది. ఆదరిస్తోంది. తెలుగు నటీనటులు, దర్శకులకు జాతీయస్థాయిలో గుర్తింపు దక్కుతోంది. దీన్ని నిలబెట్టుకునేలా దర్శకులు మరిన్ని మంచి చిత్రాలు తీయాల’న్నారు అగ్ర కథానాయకుడు అల్లు అర్జున్. -
జులైలో భారతీయుడు 2
కథానాయకుడు కమల్‌హాసన్.. దర్శకుడు శంకర్ల కలయికలో రూపొందిన చిత్రం ‘భారతీయుడు 2’. వీళ్లిద్దరి నుంచి 1996లో వచ్చిన విజయవంతమైన సినిమా ‘భారతీయుడు’కు కొనసాగింపుగా తెరకెక్కింది. -
తెరపై మ్యాజిక్ సృష్టిస్తా..
‘దర్శకులు నాకు సరిపోయే పాత్రలు ఇస్తే.. తెరపై మ్యాజిక్ చేసి చూపిస్తా’’ అంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. ఇటీవలే ‘హీరామండీ:ది డైమండ్ బజార్’తో ప్రేక్షకులను ఆకట్టుకుందీమె. -
నవ్విస్తూ.. కవ్విస్తూ.. కంటతడి పెట్టిస్తూ
‘రాజు యాదవ్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు గెటప్ శ్రీను. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని కె.కృష్ణమాచారి తెరకెక్కించారు. అంకిత కారాట్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 24న థియేటర్లలోకి రానుంది. -
నిద్ర చెడగొట్టొదంటున్న దివి.. చిరునవ్వుతో ఫరియా.. మీనాక్షి కొత్త లుక్!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఇరాన్‌ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ
-
బాధితుల గోడును ప్రసారం చేస్తే మీడియాపై కేసులా?: దేవినేని
-
చిన్నారి వైరల్ వీడియోపై విమర్శలు.. తల్లి ఆత్మహత్య