RRR: భారతీయ పాటలకు లాస్‌ ఏంజెలిస్‌లో ఆస్కార్‌ గౌరవం

ఎన్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్‌ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం.

Updated : 10 May 2024 10:07 IST

న్నో ఏళ్లుగా కలగా నిలిచిపోయిన ప్రతిష్ఠాత్మకమైన అకాడమీ పురస్కారాన్ని అందుకొని.. భారతీయ సినిమా గొప్పతనాన్ని ఆస్కార్‌ వేదికపై సగర్వంగా నిలబెట్టింది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం. ఇందులోని ‘నాటు నాటు’ పాటకు గతేడాది అకాడమీ అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు 2009లో  ‘స్లమ్‌డాగ్‌ మిలియనీర్‌’ చిత్రంలోని ‘జై హో’ అనే గీతానికి కూడా ఈ పురస్కారం వరించింది. అమీర్‌ఖాన్‌ నటించిన ‘లగాన్‌’ చిత్రంలోని పాటలు కూడా ఆస్కార్‌ నామినేషన్‌లో నిలిచాయి. సినీప్రియుల్ని మెప్పించిన ఈ పాటల్ని ఇప్పుడు.. అకాడమీ మ్యూజియం ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ‘మ్యూజికల్‌ టేప్‌స్ట్రీస్‌’ పేరుతో ప్రదర్శించనున్నట్లు తెలిపింది. ఈ నెల 18న లాస్‌ ఏంజెలిస్‌లో డేవిడ్‌ జెఫెన్‌ థియేటర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ‘‘ఈ కార్యక్రమంలో మూడు సంచలనాత్మక చిత్రాల్లోని ఎంతో మంది ప్రేక్షకుల్ని మెప్పించిన పాటల్ని ప్రదర్శించనున్నాము. కేవలం ఈ వేడుక సినిమాల గొప్పతనాన్ని చూపించడానికి మాత్రమే కాదు. భారతీయ సంగీతం గొప్పతనాన్ని ప్రపంచవ్యాప్తంగా తెలియజేయాలనుకుంటున్నామ’’ని అకాడమీ మ్యూజియం తన అధికారిక వెబ్‌సైట్‌లో తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు