Brahmanandam: ఘనంగా బ్రహ్మానందం చిన్న కుమారుడి వివాహం

ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Published : 19 Aug 2023 01:32 IST

హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం చిన్న కుమారుడు సిద్ధార్థ వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. నగరానికి చెందిన డాక్టర్‌ పద్మజా వినయ్‌ల కుమార్తె ఐశ్వర్యతో ఆయన ఏడడుగులు వేశారు. హైదరాబాద్‌లోని అన్వయ కన్వెన్షన్స్‌ ఈ వేడుకకు వేదికైంది. ఈ వివాహానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్‌, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, రామ్‌చరణ్‌, మోహన్‌ బాబు సహా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని