NTR’s Devara: దేవర వాయిదా అధికారికమేనా?

ఎన్టీఆర్‌ ‘దేవర’ వాయిదా పడనుందా? ముందు ప్రకటించినట్టుగా ఏప్రిల్‌ 5న రావడం లేదా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది.

Updated : 25 Jan 2024 07:14 IST

న్టీఆర్‌ ‘దేవర’ (NTR’s Devara) వాయిదా పడనుందా? ముందు ప్రకటించినట్టుగా ఏప్రిల్‌ 5న రావడం లేదా? అవుననే అంటున్నాయి పరిశ్రమ వర్గాలు. చిత్రబృందం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. తొలి భాగం సినిమాని ఈ ఏప్రిల్‌ 5న విడుదల చేయాలనుకున్నారు. అయితే విజువల్‌ ఎఫెక్ట్స్‌ పనులు, ప్రతినాయకుడిగా నటిస్తున్న సైఫ్‌ అలీఖాన్‌ గాయపడటం తదితర కారణాలతో సినిమాని వాయిదా వేయాలనే నిర్ణయానికి చిత్రబృందం వచ్చినట్టు తెలుస్తోంది. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాలో విజువల్‌ ఎఫెక్ట్స్‌కి ఎంతో ప్రాధాన్యం ఉంది. వాటి విషయంలో రాజీ పడకుండా మరింత నాణ్యతతో తీర్చిదిద్దే ప్రయత్నాల్లో తలమునకలై ఉంది. సముద్ర తీరం నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ఎన్టీఆర్‌ సరసన జాన్వీకపూర్‌ నటిస్తున్న విషయం తెలిసిందే. సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. కల్యాణ్‌రామ్‌ సమర్పకులు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని