Aamir Khan: ‘శ్రీకాంత్‌’ కోసం ఆమిర్‌ గీతం

మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌. తుషార్‌ హీరానందాని తెరకెక్కిస్తున్నారు.

Updated : 24 Apr 2024 12:06 IST

మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్‌’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్‌ కథానాయకుడు రాజ్‌కుమార్‌ రావ్‌. తుషార్‌ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదలైన ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాలోని ‘పాపా కహ్తే హై..’ అంటూ సాగే గీతాన్ని అగ్రకథానాయకుడు ఆమిర్‌ ఖాన్‌ విడుదల చేశారు. ఆయన ప్రధాన పాత్రలో నటించిన ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’ అనే చిత్రంలోని ఈ పాటను రీమేక్‌ చేసి ‘పాపా కహ్తే హై 2.0’ అనే పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో శ్రీకాంత్‌ చిన్ననాటి నుంచే ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడో చూపిస్తూ సాగుతున్న ఈ గీతం సినీప్రియుల్ని ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా ఆమిర్‌ ఖాన్‌ ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ..‘‘నా జీవితాన్ని మలుపు తిప్పిన చిత్రంలోని గీతమిది. ఈ ప్రాజెక్టు తొలినాళ్లలో మేమంతా ఇండస్ట్రీకి కొత్తవాళ్లం. నేను, దర్శకుడు మన్సూర్‌ ఎప్పుడూ ఈ సినిమా చూసిన కేవలం లోపాలను మాత్రమే వెతికేవాళ్లం. ఇంకా మెరుగ్గా సన్నివేశాల్ని ఎలా తీర్చిదిద్దాలి అనే చర్చ జరిగేది. ప్రేక్షకులు దీన్ని ఎలా స్వీకరిస్తారోనని భయంగా ఉండేది. కానీ.. మర్చిపోలేని బహుమతి ఇస్తుందని ఊహించలేదు. నా జీవితంలో ఎప్పటికీ ఒక మైలు రాయిలాంటి చిత్రం ‘ఖయామత్‌ సే ఖయామత్‌ తక్‌’’ అని చెప్పుకొచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని