Kriti Sanon: నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా

‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్‌ భామ కృతిసనన్‌. ఇందులో ఎయిర్‌హోస్టెస్‌ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది.

Updated : 24 Apr 2024 13:51 IST

‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్‌ భామ కృతిసనన్‌. ఇందులో ఎయిర్‌హోస్టెస్‌ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. త్వరలో ‘దో పత్తి’తో తెరపైకి రావడానికి సిద్ధమవుతోంది ఈ అందాల తార. ఆమె, కాజోల్‌ ప్రధాన పాత్రలో శంశాక చతుర్వేది తెరకెక్కిస్తున్న చిత్రమిది. ‘బ్లూ బటర్‌ ఫ్లై ఫిలిమ్స్‌’ పతాకంపై కృతి నిర్మిస్తున్న తొలి చిత్రమిది. ఈ సినిమా త్వరలో ఓటీటీ వేదికగా విడుదల కానుంది. ఈ సందర్భంగా కృతి పంచుకున్న విషయాలివీ.

  •  ‘‘దో పత్తి’.. ఇందులోని కేవలం నా పాత్ర మాత్రమే కాదు.. ఈ సినిమా మొత్తం ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాను. ఇప్పటి వరకూ నేను నటించిన ప్రాజెక్టుల కన్నా ఇందులో ఇంకేదో భిన్నంగా చేశానని అనుకుంటున్నాను. అదేంటో మీరు తెరపైనే చూడాలి.
  • నమ్మకం, ప్రేమ ఇలా ఎన్నో రకాల భావోద్వేగాలతో నిండి ఉంటుందీ నా పాత్ర. దీని కోసం శారీరకంగా, మానసికంగా ఎంతో కష్టపడ్డాను. ప్రతి సన్నివేశాన్ని అనుకున్న విధంగా పూర్తి చేయాలని సవాల్‌గా తీసుకొని నిర్మించాను. అయినా నాకు ఛాలెంజింగ్‌గా ఉండడమే ఇష్టం.
  • రాత్రింబవళ్లు అనే తేడా లేకుండా నేను నిర్మాతగా వ్యవహరిస్తున్న మొదటి ప్రాజెక్టు కోసం ఎన్నో గంటలు శ్రమించాను. ఇప్పటి వరకు నా జీవితంలోనే ఎంతో రిస్క్‌తో కూడిన ప్రాజెక్ట్‌ ఇది. అందుకే ‘దో పత్తి’ నాకు ఎప్పటికే ప్రత్యేకమైనది.
  • నాకు చిత్రపరిశ్రమలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. వరుణ్‌ ధావన్‌, కార్తిక్‌ ఆర్యన్‌ లాంటి అద్భుతమైన సహనటులతో కలిసి నటించాను. కానీ నేను ఎక్కువసార్లు కలిసి పనిచేసింది నటుడు పంకజ్‌ త్రిపాఠితో మాత్రమే. అంతేకాదు.. ఆయనే నా ఫెవరేట్‌. మేమిద్దరం కలిసి దాదాపు నాలుగు సినిమాల్లో పనిచేశాము.
  • ‘బరేలీ కీ బర్ఫీ’లో ఆయన నాకు తండ్రిగా నటించారు. ఇది నేను స్క్రీన్‌పై చూసి ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. సెట్లో ఆయన నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుంటాను. ఆయన పోషించిన ప్రతి పాత్రలో తనదైన ప్రత్యేకతను చూపిస్తాడు. అందుకే ఆయనంటే చాలా ఇష్టం. మళ్లీ మళ్లీ కలిసి పనిచేయాలనుకునే నటుడాయన.
  • నా చెల్లి నుపూర్‌ సనన్‌తో కలిసి నటించాలనుంది. మేమిద్దరం కలిసి ఎన్నో ప్రకటనల్లో నటించాము. కానీ.. కొంచెం ఆలస్యమైన మంచి కథతో వస్తాము.
  • ప్రేమకథలు, కామెడీ ఎంటర్‌టైనర్‌లు.. ఇలా ప్రతి జానర్‌లో నటించాను. కానీ.. పూర్తిగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే పాత్రలో నటించాలనుంది. కొన్ని కొన్ని సినిమాల్లో యాక్షన్‌ పాత్రలు చేసిన.. అవి పూర్తి స్థాయిలో లేవు. దీంతో పాటు నెగటీవ్‌ పాత్రలు పోషించడమంటే చాలా ఇష్టం. ఇందులో భిన్న కోణాలుంటాయి. ఇలాంటి పాత్రలు పోషించడం సరదాగా ఉంటుంది.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని