Captain Miller: హర హర ఘోర

‘కెప్టెన్‌ మిల్లర్‌’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ధనుష్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించారు. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మాతలు. ప్రియాంక మోహన్‌ కథానాయిక.

Updated : 03 Jan 2024 11:55 IST

‘కెప్టెన్‌ మిల్లర్‌’తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు ధనుష్‌. ఆయన హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అరుణ్‌ మాథేశ్వరన్‌ తెరకెక్కించారు. జి.శరవణన్‌, సాయి సిద్ధార్థ్‌ నిర్మాతలు. ప్రియాంక మోహన్‌ కథానాయిక. శివ రాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘‘ఘోర హర..’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ధనుష్‌, శివ రాజ్‌కుమార్‌పై చిత్రీకరించిన పాటిది. దీనికి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ స్వరాలు సమకూర్చగా.. రాకేందు మౌళి సాహిత్యమందించారు. రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. ‘‘1930-40ల మధ్య కాలంలో జరిగే యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందిన చిత్రమిది. తమిళ, తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని