Cinema News: కళ్యాణ గీతం

శేఖర్‌ వర్మ, వైభవి జంటగా ఎస్‌.ఎమ్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘కళ్యాణమస్తు’. ఓ.సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర...

Updated : 25 Apr 2022 08:41 IST

శేఖర్‌ వర్మ, వైభవి జంటగా ఎస్‌.ఎమ్‌.ఎస్‌ క్రియేషన్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘కళ్యాణమస్తు’. ఓ.సాయి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రంలోని ‘గల గల ఈ మాటల్లో ఉందే పిల్ల జాతర... సుర సుర నీ చూపుల్లో ఉందే మందు పాతర... ’ అంటూ సాగే పాటని విడుదల చేశారు. అలరాజు రచించిన ఈ గీతాన్ని మంగ్లీ, ధృవన్‌ ఆలపించారు. ఆర్‌.ఆర్‌.ధృవన్‌ స్వరకర్త. ఈ పాటకి లభిస్తున్న స్పందనపట్ల చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ‘‘విభిన్నమైన కథతో రూపొందుతున్న చిత్రమిది. శేఖర్‌ వర్మ, వైభవి జోడీ అలరిస్తుంది. గల గల... పాటలో శేఖర్‌ వర్మ స్టెప్స్‌ ఆకట్టుకుంటాయి. సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాల్ని త్వరలోనే  వెల్లడిస్తామ’’ని చిత్రవర్గాలు తెలిపాయి. దీనికి ఛాయాగ్రహణం: మల్లికార్జున్‌ నరగాని.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని