Akshay Kumar: అక్షయ్‌తో వివాదం.. స్పందించిన యాంకర్
‘ది కపిల్‌శర్మ షో’తో వ్యాఖ్యాతగా ఫేమ్ సొంతం చేసుకున్నారు నటుడు కపిల్ శర్మ. తనదైన కామెడీ టైమింగ్‌తో స్టార్ సెలబ్రిటీలను సైతం ఆయన ఆకట్టుకున్నారు..
ముంబయి: ‘ది కపిల్‌శర్మ షో’తో ఎంతో పేరు తెచ్చుకున్నారు నటుడు కపిల్ శర్మ. తనదైన కామెడీ టైమింగ్‌తో స్టార్ సెలబ్రిటీలను సైతం ఆయన ఆకట్టుకున్నారు. దీంతో ఈ షో ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. పలువురు స్టార్ సెలబ్రిటీలు సైతం తమ చిత్రాన్ని ప్రమోట్ చేసుకునేందుకు ఈ షోకు రావడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తుంటారు. ఇప్పటికే పలుమార్లు తన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఈ ప్లాట్‌ఫామ్‌పై సందడి చేసిన బాలీవుడ్ స్టార్హీరో అక్షయ్‌కుమార్.. ఇటీవల జరిగిన ఓ ఘటన వల్ల కపిల్‌పై గుర్రుగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో తన తదుపరి చిత్రం ‘బచ్చన్ పాండే’ ప్రమోషన్స్‌కి అక్షయ్.. ఈ షోకి రావడం లేదని మంగళవారం సోషల్‌మీడియాలో ప్రచారం జరిగింది.
కాగా, నెట్టింట్లో వస్తోన్న వార్తలపై తాజాగా కపిల్ స్పందించారు. ‘‘అక్షయ్‌కు, నాకు మధ్య విభేదాలు వచ్చాయంటూ మీడియాలో వస్తోన్న వార్తలు చూశా. ఇప్పుడే నేను అక్షయ్‌తో మాట్లాడాను. సమాచారలోపంతోనే మా మధ్య అపార్థాలు తలెత్తాయి. నేను ఫోన్ చేసి మాట్లాడటంతో ఇప్పుడు అవన్నీ తొలగిపోయాయి. ‘బచ్చన్‌పాండే’ ప్రమోషన్స్ కోసం త్వరలోనే ఆయన మన షోలో సందడి చేయనున్నారు. అక్షయ్ నాకు ఎప్పటికీ పెద్దన్న లాంటివారు. ఆయనకు నాపై ఎలాంటి కోపం లేదు’’ అని కపిల్ వివరించారు.
ఇక, ఇటీవల ‘ఆత్రంగి రే’ ప్రమోషన్స్ కోసం అక్షయ్ కపిల్‌శర్మ షోకి వచ్చారు. ప్రధాని మోదీని అక్షయ్ గతంలో ఇంటర్వ్యూ చేయడంపై షోలో భాగంగా కపిల్ పలు సరదా ప్రశ్నలు వేశారు. దానిపై అసహనానికి గురైన అక్షయ్.. ఆ క్లిపింగ్ని ఎపిసోడ్ నుంచి తొలగించాలని కోరారు. నిర్వాహకులు అంగీకరించినప్పటికీ.. అవి అనుకోకుండా నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఈ వ్యవహరంపైనే అక్షయ్ ఆగ్రహంగా ఉన్నారని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్‌ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్