Kazan Khan: ఇండస్ట్రీలో విషాదం.. గుండెపోటుతో నటుడి మృతి

నటుడు కజాన్‌ ఖాన్‌ (Kazan Khan) కన్నుమూశారు. సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు.

Published : 13 Jun 2023 12:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సినీ పరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మాలయాళ నటుడు కజాన్‌ ఖాన్‌ (Kazan Khan) కన్నుమూశారు. ఎన్నో సినిమాల్లో విలన్‌ పాత్రల్లో నటించిన ఆయన సోమవారం రాత్రి గుండెపోటుతో మరణించారు. కేరళకు చెందిన కజాన్‌ ఖాన్‌ 1992లో వచ్చిన ‘సెంతమిట్‌ పట్టు’ అనే చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేశారు. ఈ సినిమానే తెలుగులో ‘అమ్మకొడుకు’ అనే పేరుతో విడుదల చేశారు. కజాన్‌ ఖాన్‌ మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 2001లో దివంగత నటుడు శ్రీహరి హీరోగా నటించిన ‘భద్రాచలం’ సినిమాలో కజాన్‌ ఖాన్‌ విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నాడు. ఆయన మరణ వార్త తెలిసి ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని