Keerthy Suresh: రఘు తాత విడుదలకు సిద్ధం

నాయికా ప్రాధాన్య కథలను ఎంచుకుంటూ.. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది కీర్తి సురేశ్‌. కెరీర్‌ ఆరంభమైన కొన్నాళ్లకే ‘మహానటి’ అని నిరూపించుకుంది ఈ భామ. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉందామె.

Updated : 20 Dec 2023 11:17 IST

నాయికా ప్రాధాన్య కథలను ఎంచుకుంటూ.. ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తోంది కీర్తి సురేశ్‌. కెరీర్‌ ఆరంభమైన కొన్నాళ్లకే ‘మహానటి’ అని నిరూపించుకుంది ఈ భామ. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉందామె. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రఘు తాత’. సుమన్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నట్లు తెలిపింది చిత్రబృందం. విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుపుతూ.. మంగళవారం సామాజిక మాధ్యమాల వేదికగా ఓ వీడియోను పంచుకుంది నిర్మాణ సంస్థ. ధృడ సంకల్పం ఉన్న ఓ మహిళ చేసే స్ఫూర్తిదాయకమైన పోరాట కథను ఇందులో చూపించనున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని