Kiara Advani: ‘గేమ్‌ ఛేంజర్‌’.. మీ ఊహకు మించి: కియారా అడ్వాణీ

రామ్‌చరణ్‌ హీరోగా దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్‌ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ఈ సినిమా అప్‌డేట్‌ని హీరోయిన్‌ కియారా అడ్వాణీ పంచుకున్నారు.

Published : 04 Aug 2023 20:52 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama) తర్వాత హీరో రామ్‌చరణ్‌ (Ram Charan), హీరోయిన్‌ కియారా అడ్వాణీ (Kiara Advani) కలిసి నటిస్తున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ (Game Changer). కోలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు శంకర్‌ (Shankar) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కియారా ఈ సినిమా అప్‌డేట్‌ ఇచ్చారు. రామ్‌చరణ్‌ అభిమానులు, ప్రేక్షకుల ఊహకు మించి ఈ సినిమా ఉంటుందంటూ ఆసక్తి రేకెత్తించారు. ‘‘సుమారు రెండేళ్ల నుంచి గేమ్‌ ఛేంజర్‌ సినిమా షూటింగ్‌ జరుగుతోంది. ఈ ఏడాది చివరికి పూర్తవుతుందనుకుంటున్నా. అవుట్‌పుట్‌ అద్భుతంగా వస్తోంది. ఈ చిత్రం కోసం మేమంతా ఎంతో కష్టపడుతున్నాం’’ అని పేర్కొన్నారు. రామ్‌చరణ్‌ తనకు మంచి స్నేహితుడని, దర్శకుడు శంకర్‌ నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని తెలిపారు. పాన్‌ ఇండియా స్థాయిలో ముందుగా ఈ చిత్రాన్ని క్రిస్మస్‌ కానుకగా విడుదల చేయాలని దర్శక, నిర్మాతలు భావించారు. కియారా ఇచ్చిన అప్‌డేట్‌తో ఈ సినిమా డిసెంబరులో విడుదలయ్యే అవకాశాలు లేనట్టే అనిపిస్తోంది. 

ఆ విషయం నన్నెంతో భయపెడుతుంది: సాయి ధరమ్‌ తేజ్‌

ప్రముఖ నిర్మాత దిల్‌రాజు (Dil Raju) నిర్మిస్తున్న 50వ చిత్రమిది. బడ్జెట్‌ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా రూపొందిస్తున్నారు. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీలో రామ్‌చరణ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారని సమాచారం. శ్రీకాంత్‌, అంజలి, ఎస్‌.జె. సూర్య, సునీల్‌ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మరోవైపు, కమల్‌హాసన్‌ హీరోగా శంకర్‌ ‘ఇండియన్‌ 2’ (భారతీయుడు 2) సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో 1996లో వచ్చిన ‘ఇండియన్‌’కు సీక్వెల్‌ ఇది. షూటింగ్‌ చేస్తూనే, మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్స్‌ పనులు చేస్తున్నారు. అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీతో దివంగత నటులు వివేక్‌, నెడముడి వేణు పాత్రలను రీక్రియేట్‌ చేయబోతున్నారు. ఈ సినిమా విడుదల తేదీపైనా స్పష్టత లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని