Cinema News: ‘కడువా’.. వారం ఆలస్యంగా
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) హీరోగా షాజీ కైలాస్ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘కడువా’ (Kaduva). సుప్రియా మేనన్, లిస్టిన్ స్టీఫెన్ సంయుక్తంగా నిర్మించారు. సంయుక్త మేనన్ కథానాయిక. వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాను జూన్ 30న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. ఇప్పుడీ చిత్రాన్ని జులై 7న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని పృథ్వీరాజ్ సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించారు. ‘‘అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులందరికీ క్షమాపణలు. అనుకోని పరిస్థితుల వల్ల ‘కడువా’ను జులై 7కి వాయిదా వేశాం. ప్రచార కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తాం. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు మీ అందరి ప్రేమ, మద్దతు కొనసాగాలి’’ అని ఆయన తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. సంగీతం: జేక్స్ బిజోయ్, ఛాయాగ్రహణం: అభినందన్ రామానుజం.
మగాళ్లలో మార్పు తెచ్చే ‘ఫిమేల్’
శుభాంగి తంభాలే ప్రధాన పాత్రలో నాని తిక్కిశెట్టి తెరకెక్కించిన చిత్రం ‘ఫిమేల్’ (Female). వెలిచర్ల ప్రదీప్ రెడ్డి నిర్మాత. దీపిక, తమన్నా సింహాద్రి, బేబీ దీవెన తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra Reddy) ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘మహిళలపై జరుగుతున్న అన్యాయాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా.. ఆడవాళ్లలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని, మగాళ్లలో మార్పును తీసుకొచ్చే విధంగా ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. సంగీతం: వంశీకాంత్ రేఖన, కూర్పు: క్రాంతి, ఛాయాగ్రహణం: జగదీష్ కొమరి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Ap-top-news News
Andhra News: ఆర్పీఎఫ్ కానిస్టేబుల్‌గా ధైర్య సాహసాలు.. సిక్కోలు అమ్మాయికి ప్రశంసలు
-
Crime News
Hyderbad News: కారు డ్రైవర్‌పై 20 మంది దాడి.. కాళ్లమీద పడినా కనికరించలే!
-
Ts-top-news News
Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం
-
Crime News
Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
-
General News
ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
-
Sports News
Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Kidnaping: ఏడేళ్ల వయసులో కిడ్నాప్.. ఆపై ట్విస్ట్.. చివరకు 16 ఏళ్లకు ఇంటికి!
- ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (08-08-2022)
- Rohit Sharma : అది నిజంగా అద్భుతం.. ఎందుకంటే..? : రోహిత్ శర్మ
- IND vs WI: విండీస్ చిత్తు చిత్తు.. ఐదో టీ20లో భారత్ ఘన విజయం
- Sri lanka Athletes: కామన్వెల్త్ క్రీడల నుంచి 10 మంది శ్రీలంక క్రీడాకారుల అదృశ్యం!
- Crime news: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురి మృతి
- Pooja Gehlot: భారత ప్రధానిని చూడండి.. మోదీకి పాకిస్థాన్ జర్నలిస్ట్ ప్రశంస
- Allu Arjun: కల్యాణ్‌రామ్ అంటే నాకెంతో గౌరవం: అల్లు అర్జున్
- Kesineni Nani: ఎంపీ కేశినేని నాని పేరుతో ట్వీట్ల కలకలం
- Weather Report: నేడు, రేపు కుంభవృష్టికి అవకాశం