ETV WIN: లిటిల్‌ మిస్‌ నైనా.. ఈటీవీ విన్‌లో

గౌరీ జి కిషన్‌, షేర్షా షరీఫ్‌ జంటగా నటించిన మలయాళీ చిత్రం ‘లిటిల్‌ మిస్‌ రాథర్‌’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని విష్ణు దేవ్‌ తెరకెక్కించారు.

Updated : 25 Jan 2024 10:52 IST

గౌరీ జి కిషన్‌, షేర్షా షరీఫ్‌ జంటగా నటించిన మలయాళీ చిత్రం ‘లిటిల్‌ మిస్‌ రాథర్‌’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. ఈ రొమాంటిక్‌ కామెడీ చిత్రాన్ని విష్ణు దేవ్‌ తెరకెక్కించారు. ఇప్పుడీ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాను ‘లిటిల్‌ మిస్‌ నైనా’ పేరుతో ప్రముఖ ఓటీటీ వేదిక ఈటీవీ విన్‌లో గురువారం విడుదల చేస్తుంది చిత్రబృందం. పొట్టిగా ఉన్న యువతి నైనా రాథర్‌, పొడవైన వ్యక్తి అభిజిత్‌ చంద్రదాస్‌ మధ్య ప్రేమ ఎలా ఏర్పడింది? ప్రేమలో పడ్డాక వీళ్లిద్దరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారనేది ఈ సినిమాలో చూపించనున్నారు. నిఖితా థెరిసా, సంగీత్‌ ప్రతాప్‌ కీలక పాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని