Lucky Laxman: అందరూ మెచ్చే ‘లక్కీ లక్ష్మణ్‌’

సోహెల్‌, మోక్ష జంటగా ఎ.ఆర్‌.అభి తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’. హరిత గోగినేని నిర్మాత. దేవి ప్రసాద్‌,  రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

Updated : 07 Jul 2022 11:54 IST

సోహెల్‌(Sohel), మోక్ష(Moksha) జంటగా ఎ.ఆర్‌.అభి తెరకెక్కిస్తున్న చిత్రం ‘లక్కీ లక్ష్మణ్‌’ (Lucky Laxman). హరిత గోగినేని నిర్మాత. దేవి ప్రసాద్‌,  రాజా రవీంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు అనిల్‌ రావిపూడి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ఫస్ట్‌లుక్‌ చాలా బాగుంది. తొలి చిత్రమైనా దర్శక నిర్మాతలు చక్కగా రూపొందించారు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి కుటుంబ కథా చిత్రమిది. ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుంది’’ అన్నారు దర్శకుడు. నిర్మాత హరిత మాట్లాడుతూ.. ‘‘చిత్రీకరణ పూర్తయింది. నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం’’ అన్నారు. ‘‘కథ పరంగా, సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంద’’న్నారు సోహెల్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని