Malaika Arora: వయసులో చిన్నవాడితో డేటింగ్‌.. తప్పేముంది: మలైకా

వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తితో డేటింగ్‌ చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు బాలీవుడ్‌ నటి, వ్యాపారవేత్త మలైకా అరోరా.....

Updated : 23 Apr 2022 11:26 IST

ముంబయి: వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తితో డేటింగ్‌ చేస్తే తప్పేంటి అని అడుగుతున్నారు బాలీవుడ్‌ నటి, వ్యాపారవేత్త మలైకా అరోరా. ‘చయ్యా, చయ్యా’ సాంగ్‌తో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. సహాయ నటిగానే కాకుండా పలు చిత్రాల్లో స్పెషల్‌ సాంగ్స్‌తో యువతను మెప్పించారు. ప్రస్తుతం ఈమె ఓ రియాల్టీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. కాగా, తనకంటే 12 ఏళ్లు చిన్నవాడైన నటుడు అర్జున్‌ కపూర్‌తో మలైకా ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం వీళ్లిద్దరూ డేటింగ్‌లో ఉన్నారు. దీంతో ‘‘పన్నెండేళ్లు చిన్నవాడైన అబ్బాయితో ఎలా రిలేషన్‌లో ఉన్నావు?’’ అంటూ సోషల్‌మీడియాలో ఆమెను నెటిజన్లు ప్రశ్నించారు.

వీటిపై తాజాగా మలైకా స్పందించారు. ఓ ఆన్‌లైన్‌ పోర్టల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన రిలేషన్‌ గురించి ప్రస్తావించారు. ‘‘ఒక మహిళ వయసులో తనకంటే చిన్నవాడైన వ్యక్తితో రిలేషన్‌లో ఉంటే ఈ సమాజం ఎందుకు తప్పుగా చూస్తోంది. అందులో అస్సలు తప్పేముంది? బ్రేకప్‌, లేదా విడాకుల తర్వాత ఒక మహిళ.. తనకంటూ ఓ జీవితాన్ని క్రియేట్‌ చేసుకోవాలి. స్వశక్తితో ముందడుగు వేయాలి. ధైర్యంగా ఎలా జీవించాలో మా అమ్మ నుంచి ప్రేరణ పొందాను. ‘నీకిష్టం వచ్చినట్లు నువ్వు జీవించు. ఎవరిపై ఆధారపడకు. నీకు ఏం చేయాలనిపిస్తే అది మనస్ఫూర్తిగా చేశాయ్‌’ అని మా అమ్మ ఎప్పుడూ చెబుతుండేవారు. ఆ మాటల్నే నేను ఎక్కువగా నమ్ముతుంటాను’’ అని మలైకా తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని