Naa Saami Ranga: ఆ నవ్వే నాకు ధైర్యం.. వారిని మిస్‌ అవుతున్నా: నాగార్జున

‘నా సామిరంగ’ సినిమా విజయోత్సవ వేడుకను హైదరాబాద్‌లో నిర్వహించారు. నాగార్జున, అల్లరి నరేశ్‌, ఆషికా రంగనాథ్‌ తదితరులు పాల్గొని సందడి చేశారు.

Published : 28 Jan 2024 22:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అభిమానుల నవ్వు తనకు ధైర్యాన్నిస్తుందని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) అన్నారు. హైదరాబాద్‌లో ఆదివారం నిర్వహించిన ‘నా సామిరంగ’ (Naa Saami Ranga) విజయోత్సవ సభలో పాల్గొని మాట్లాడారు. నాగార్జున, అల్లరి నరేశ్‌, రాజ్‌ తరుణ్‌, ఆషికా రంగనాథ్‌, మిర్నా మేనన్‌, రుక్సర్‌ థిల్లాన్‌ ప్రధాన పాత్రల్లో కొరియోగ్రాఫర్‌ విజయ్‌ బిన్నీ తెరకెక్కించిన చిత్రమిది. సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై ప్రేక్షకులను అలరించింది. చిత్ర బృందానికి నాగార్జున, నిర్మాత శ్రీనివాసా చిట్టూరి జ్ఞాపికలు అందజేశారు (Naa Saami Ranga Sankranthi Blockbuster Celebrations).

రివ్యూ: లిటిల్‌ మిస్‌ నైనా.. ఎత్తులో వ్యత్యాసం ఉంటే?

వేడుకనుద్దేశించి నాగార్జున మాట్లాడుతూ.. ‘‘ముందుగా అభిమానులకు కృతజ్ఞతలు. సినిమాలు హిట్‌ అయినా, ఫ్లాప్‌ అయినా ఎప్పుడూ నాపై ప్రేమ కురిపిస్తారు. నేను కనిపిస్తే చాలు ఆనందంగా నవ్వుతారు. ఆ నవ్వే నాకు ధైర్యాన్నిస్తుంది. మా చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు ఆలస్యంగా  ప్రకటించాం. అయినా.. డిస్ట్రిబ్యూటర్లు సహకరించారు. వారికి, సినిమాని ఆదరించిన ప్రేక్షకులందరికీ థ్యాంక్స్‌. ఈ సినిమా ప్రయాణం ఆహ్లాదకరంగా సాగింది. చిత్ర బృందాన్ని మిస్‌ అవుతున్నా. నాన్న జయంతి (సెప్టెంబరు 20, 2023) సందర్భంగా చిత్రీకరణ ప్రారంభించాం. సంక్రాంతికి విడుదల చేస్తామని అదే రోజు నా కుటుంబ సభ్యులకు చెప్పా. సినిమా షూటింగ్‌ సమయంలోనూ పలువురితో అదే విషయం చర్చిస్తే.. ఎవరూ నమ్మలేదు. ‘అంత త్వరగా పూర్తవుతుందా’ అన్నట్లు చూసేవారు. కానీ, సంక్రాంతికి విడుదల చేయడం పక్కా అని నా టీమ్‌ నమ్మకంగా ఉండేది. అనుకున్న సమయానికి సినిమా పూర్తికావడానికి కారణం సంగీత దర్శకుడు ఎం. ఎం. కీరవాణి. వచ్చే సంక్రాంతికి కలుద్దాం’’ అని అన్నారు. కార్యక్రమంలో అల్లరి నరేశ్‌, ఆషికా రంగనాథ్‌, కీరవాణి, పాటల రచయిత చంద్రబోస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని