Niharika: నాలుగేళ్ల తర్వాత సినిమాల్లోకి నిహారిక.. మంచు మనోజ్‌ చిత్రంలో మెరవనున్న నటి..!

వెండితెర వేదికగా వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు నటి నిహారిక. మంచు మనోజ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రంలో ఆమె కీలకపాత్ర పోషిస్తున్నారు.

Updated : 18 Dec 2023 17:19 IST

హైదరాబాద్‌: నాగబాబు కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి పలు చిత్రాల్లో హీరోయిన్‌గా నటించారు నిహారిక (Niharika). 2019లో విడుదలైన ‘సూర్యకాంతం’, ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రాల తర్వాత వెండితెరకు దూరంగా ఉన్నారామె. కొంతకాలం నుంచి వెబ్‌ సిరీస్‌లతో అలరిస్తోన్న ఆమె తాజాగా మరోసారి వెండితెర వేదికగా ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెలువడ్డాయి.

రివ్యూ: వ్యూహం.. అన్నపూర్ణ స్టూడియోస్‌ వెబ్‌సిరీస్‌ ఎలా ఉందంటే?

మంచు మనోజ్‌ (Manchu Manoj) హీరోగా నటిస్తోన్న చిత్రం ‘వాట్‌ ది ఫిష్’ (WTF). వరుణ్‌ కోరుకొండ దర్శకుడు. ‘మనం మనం బరంపురం’.. అన్నది ఉపశీర్షిక. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నిహారిక కీలక పాత్ర పోషిస్తున్నారు. అష్టలక్ష్మి అనే ధనవంతురాలైన అమ్మాయి పాత్రలో ఆమె కనిపించనున్నారు. ఈ మేరకు సోమవారం నిహారిక పుట్టినరోజు సందర్భంగా ‘వాట్‌ ది ఫిష్’ (WTF) చిత్రబృందం ఆమె ఫస్ట్‌లుక్‌ను షేర్‌ చేసింది. ఇక, ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. విశాల్‌ బెజవాడ, సూర్య బెజవాడ సంయుక్తంగా దీనిని నిర్మిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని