Parineeti- Raghav Chadha: పరిణీతి- రాఘవ్‌ చద్దా పెళ్లి సందడి షురూ.. ఫొటోలు వైరల్‌

కాబోయే దంపతులు రాఘవ్‌ చద్దా, పరిణీతి చోప్రా తమ పెళ్లి వేడుకకు వేదికకానున్న ఉదయ్‌పుర్‌ చేరుకున్నారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Published : 22 Sep 2023 17:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆమ్‌ ఆద్మీ పార్టీ (APP) ఎంపీ రాఘవ్‌ చద్దా (Raghav Chadha), బాలీవుడ్‌ నటి పరిణీతి చోప్రా (Parineeti Chopra) అతి త్వరలోనే వివాహం బంధంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబరు 24న వీరి పెళ్లి జరగనుందని సమాచారం. ఆ వేడుకకు ఉదయ్‌పుర్‌ (రాజస్థాన్‌లోని)లోని లీలా ప్యాలెస్‌ వేదిక కానుంది. ఇప్పటికే ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్స్‌ ప్రారంభమయ్యాయి. కాబోయే దంపతులు, కుటుంబ సభ్యులు తాజాగా అక్కడకు చేరుకున్నారు. విమానాశ్రయంలో వారిద్దరిని పలువురు తమ ఫోన్లతో క్లిక్‌మనిపించారు. సంబంధిత ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. పరిణీతి రెడ్‌ కలర్‌ డ్రెస్సులో, రాఘవ్‌ బ్లాక్‌ కలర్‌ టీ షర్టులో కనిపించారు. నేడు మెహందీ ఫంక్షన్‌ నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాలు, సన్నిహితులు మాత్రమే ఆ వేడుకలో పాల్గొంటారని సమాచారం (Raghav Chadha Parineeti Chopra Wedding).

సడెన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘బెదురులంక’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే!

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌సహా పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు పరిణీతి- రాఘవ్‌ పెళ్లికి హాజరుకానున్నారు. పరిణీతి కజిన్‌, ప్రముఖ నటి ప్రియాంక చోప్రా (Priyanka Chopra) సెప్టెంబరు 23న ఉదయ్‌పుర్‌ చేరుకుంటారని సమాచారం. వృత్తిపరమైన కారణాల వల్ల ఆమె భర్త నిక్‌ జొనాస్‌ వెడ్డింగ్‌కు హాజరవరని బాలీవుడ్‌ మీడియాలో వార్తలొస్తున్నాయి. సెప్టెంబరు 30న రిసెప్షన్‌ ఉండనున్నట్లు తెలుస్తోంది. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న పరిణీతి- రాఘవ్‌ల నిశ్చితార్థం మే 13న వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని