Waltair Veerayya: బాస్‌ వచ్చిండు... కిక్‌ ఇచ్చిండు

బాస్‌ వచ్చిండు.. కిక్‌ ఇచ్చిండు... అంటూ సాగే బాస్‌ పార్టీ పాటతో ‘వాల్తేరు వీరయ్య’ హంగామా షురూ అయ్యింది. చిరంజీవి కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది.

Updated : 24 Nov 2022 06:54 IST

బాస్‌ వచ్చిండు.. కిక్‌ ఇచ్చిండు... అంటూ సాగే బాస్‌ పార్టీ పాటతో ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) హంగామా షురూ అయ్యింది. చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. శ్రుతిహాసన్‌ (Shruti Haasan) కథానాయిక. రవితేజ ముఖ్యభూమిక పోషిస్తున్నారు. బాబీ కొల్లి (కె.ఎస్‌.రవీంద్ర) దర్శకత్వం వహిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మాతలు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాలోని ప్రత్యేక గీతం లిరికల్‌ వీడియోని బుధవారం విడుదల చేశారు. చిరంజీవి, ఊర్వశి రౌతేలాపై తెరకెక్కించిన ఈ గీతాన్ని దేవిశ్రీప్రసాద్‌ స్వరపరచగా, ఆయనతో కలిసి నకాష్‌ అజీజ్‌, హరిప్రియ ఆలపించారు. శేఖర్‌ నృత్య రీతులు సమకూర్చారు. మాస్‌ యాక్షన్‌ అంశాలతో కూడిన ఈ చిత్రంలో చిరంజీవి మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: ఆర్ధర్‌ ఎ.విల్సన్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌: ఎ.ఎస్‌.ప్రకాష్‌, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్‌, కె.చక్రవర్తి రెడ్డి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని