Pushpa: ‘పుష్ప’రాజ్‌ బాలీవుడ్‌ను నేరుగా పలకరించలేడా?

అల్లుఅర్జున్ కథానాయకుడిగా సుకుమార్‌దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్‌నేపథ్యంలో

Updated : 06 Nov 2021 16:49 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల చేస్తామని చిత్ర బృందం గతంలోనే ప్రకటించింది. మరోవైపు మొదటి పార్ట్‌ను డిసెంబరులో విడుదల చేయటానికి ఇప్పటికే సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. ‘పుష్ప’ చిత్రాన్ని హిందీలో విడుదల చేసేందుకు అక్కడి పంపిణీదారులు సుముఖంగా లేరట. ఈ విషయమై చిత్ర నిర్మాతలు అక్కడి పంపిణీదారులతో చర్చలు జరుపుతున్నారు. అయినా కూడా వాళ్లు ముందుకు రావటం లేదని తెలుస్తోంది. ఒకానొకదశలో అల్లు అరవింద్‌ నేరుగా రంగంలోకి దిగి మంతనాలు జరిపినా ఎలాంటి కదలిక లేకపోవడంతో ఏం చేయాలో చిత్ర బృందానికి అర్థం కావటం లేదని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

సాధారణంగా అల్లు అర్జున్‌ డబ్బింగ్‌ చిత్రాలకు బాలీవుడ్‌లో విపరీతమైన క్రేజ్‌ ఉంది. ఇప్పటివరకూ బన్ని నటించిన ఏ చిత్రమూ నేరుగా విడుదల కాకపోయినా, ఆయన నటించిన ప్రతి చిత్రం యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌ను సొంతం చేసుకుంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే ‘పుష్ప’ మేకర్స్‌ తాజా చిత్రాన్ని భారీగా విడుదల చేయాలని పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కించారు. ఇప్పుడేమో పరిస్థితులు అన్నీ తల్లకిందులు అయినట్లు తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. ఫహద్‌ ఫాజిల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని