Pushpa 2: ‘పుష్ప’రాజ్‌ రూల్‌కు కౌంట్‌డౌన్‌ మొదలు

అల్లు అర్జున్‌ (Allu Arjun) హీరోగా సుకుమార్‌ (Sukumar) తెరకెక్కిస్తోన్న పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). దీని రిలీజ్‌ డేట్‌ కౌంట్‌డౌన్‌ మొదలైంది.

Published : 29 Jan 2024 16:24 IST

హైదరాబాద్‌: టాలీవుడ్‌లో రానున్న మోస్ట్‌ అవెయిటెడ్‌ చిత్రాల్లో ఒకటి ‘పుష్ప ది రూల్‌’ (Pushpa The Rule). 2021లో విడుదలైన ‘పుష్ప ది రైజ్‌’కు కొనసాగింపుగా రానున్న దీని కోసం సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని గ్రాండ్‌ రిలీజ్‌ కానుంది. ఈనేపథ్యంలోనే చిత్రబృందం కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. ‘‘200 రోజుల్లో పుష్పరాజ్‌ తన రూల్‌ మొదలుపెట్టనున్నాడు. ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా ఇది విడుదల కానుంది’’ అని టీమ్‌ పేర్కొంది. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. #Pushpa2TheRule హ్యాష్‌ట్యాగ్‌ను జత చేస్తూ వరుస ట్వీట్స్‌ చేస్తున్నారు.

Sheena Bora Case: ఓటీటీలోకి సంచలన ‘షీనా బోరా కేసు’.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే..?

సుకుమార్‌ - అల్లు అర్జున్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ‘పుష్ప ది రైజ్‌’ తెరకెక్కింది. రష్మిక కథానాయిక. ఫహద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ కీలక పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నిర్మితమైంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి గాను అల్లు అర్జున్‌ ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో దీనిని తీర్చిదిద్దారు. కూలీగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన పుష్పరాజ్‌.. ఎర్రచందనం సిండికేట్‌ను శాసించే స్థాయికి ఎలా వెళ్లాడనే ఆసక్తికర అంశాలతో ‘పుష్ప ది రైజ్‌’ చిత్రీకరించారు. ఆ తర్వాత అతడికి ఎదురైన ఇబ్బందులు ఏమిటి? వాటిని ఎలా ఎదుర్కొన్నాడు? అనే అంశాలతో ‘పుష్ప ది రూల్‌’ సిద్ధమవుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇది చిత్రీకరణ దశలో ఉంది. గంగమ్మ తల్లి జాతరకు సంబంధించిన సన్నివేశాలు హైలైట్‌గా ఉండనున్నాయని టాక్.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని