Vimanam: భావోద్వేగాల ‘విమానం’
‘విమానం’ సినిమాలో అందరి హృదయాల్ని తాకే భావోద్వేగాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు.
‘విమానం’ (Vimanam) సినిమాలో అందరి హృదయాల్ని తాకే భావోద్వేగాలు ఉన్నాయంటున్నారు ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు. ఇలాంటి విభిన్నమైన కథాంశాలతో రూపొందే చిత్రాల్ని పరిశ్రమ, ప్రేక్షకులు ప్రోత్సహించాలని కోరారు. సముద్రఖని, అనసూయ భరద్వాజ్, మాస్టర్ ధ్రువన్, మీరాజాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధన్‌రాజ్, రాజేంద్రన్ కీలక పాత్రలు పోషించిన చిత్రమిది. శివప్రసాద్ యానాల దర్శకత్వం వహిస్తున్నారు. జీ స్టూడియోస్‌తో కలిసి కిరణ్ కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని ‘విమానం’ ట్రైలర్‌ని వీక్షించిన అనంతరం కె.రాఘవేంద్రరావు మాట్లాడారు. ‘‘చిన్నప్పుడు పిల్లల్లో మంచి లక్ష్యాల్ని, భావాల్ని నూరిపోస్తే వాళ్లు పెద్దయ్యాక ఏదైనా సాధిస్తారు. ఆ విషయాన్నే తండ్రీ కొడుకుల మధ్య భావోద్వేగాలతో ఈ సినిమాలో చెబుతున్నారు. ట్రైలర్ చూశాక జి.ఎం.ఆర్. సంస్థల అధినేత గ్రంధి మల్లికార్జునరావు జీవితం గుర్తొచ్చింది. భావోద్వేగాల్ని హృదయాలకి హత్తుకునేలా చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చారు. సముద్రఖని, మాస్టర్ ధ్రువన్, అనసూయ, రాజేంద్రన్, ధన్‌రాజ్ తదితరులు మంచి పాత్రల్లో కనిపించార’’న్నారు. ఈ సినిమా ఈ నెల 9న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పుడు పరిచయం...
శివ కందుకూరి కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘మను చరిత్ర’. మేఘ ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ కథానాయికలు. భరత్ పెదగాని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ప్రొద్దుటూరు టాకీస్ పతాకంపై ఎన్.శ్రీనివాసరెడ్డి నిర్మిస్తున్నారు. ఈ నెల 23న చిత్రం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ‘ఇప్పుడే పరిచయమే...’ అంటూ సాగే ఈ చిత్రంలోని పాటని ఇటీవలే ప్రముఖ కథానాయిక సంయుక్త మేనన్ విడుదల చేశారు. గోపీసుందర్ స్వరకల్పనలోని ఈ పాటని చంద్రబోస్ రచించగా, అర్మాన్ మాలిక్ ఆలపించారు. ‘‘గాఢమైన భావోద్వేగాలతో కూడిన ప్రేమకథా చిత్రమిది. శివ కందుకూరి అవతారం కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటుంది. టీజర్‌లో ఆయన కనిపించిన విధానం సినిమాపై ఆసక్తిని పెంచింది. ఇప్పుడు పరిచయమే... పాటలో ప్రధాన జోడీ మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంద’’ని సినీవర్గాలు తెలిపాయి. ప్రియా వడ్లమాని, సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్, మధునందన్, రఘు, దేవిశ్రీప్రసాద్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాహుల్ శ్రీవాత్సవ్.
మరుపురాని కథ..
కార్తీక్ ఆర్యన్, కియారా అడ్వాణీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘సత్యప్రేమ్ కి కథ’. సమీర్ విధ్వాన్ దర్శకుడు. సాజిద్ నడియాద్‌వాలా, నమః పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ రొమాంటిక్ మ్యూజికల్ సినిమాలోని హీరోహీరోయిన్ల లుక్‌తో కూడిన రొమాంటిక్ పోస్టర్‌ని ఆదివారం విడుదల చేశారు. సోమవారం చిత్ర ట్రైలర్ విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. పోస్టర్‌లో కథానాయిక కియారా.. హీరో గుండెలపై పడుకొని ఒకరి కళ్లలోకి ఒకరు తదేకంగా చూస్తున్నట్టుగా ఉంది. ఈ సంగీత ప్రధాన చిత్రానికి తనిష్క్ బాగ్చీ, పాయల్ దేవ్ బాణీలు అందిస్తున్నారు. జూన్ 29న థియేటర్లలోకి వస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyundai, Kia Recall: అమెరికాలో 34 లక్షల హ్యుందాయ్, కియా కార్ల రీకాల్
-
Alia Bhatt: రణ్‌బీర్‌ను ముద్దాడిన అలియా.. పోస్ట్ వైరల్
-
Ganesh Nimajjanam: గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ గణేశుడు.. ఘనంగా నిమజ్జనోత్సవం
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు