Ranbir Kapoor: అంబానీ చెప్పిన ఆ మాటే నాకు స్ఫూర్తి: రణ్‌బీర్‌ కపూర్‌

సినీ రంగానికి చేసిన కృషికిగానూ ప్రముఖ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌(Ranbir Kapoor)ను మహారాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. 

Updated : 16 Feb 2024 10:51 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్‌ అంబానీ(Mukesh Ambani) తనకు గొప్ప జీవిత సారాన్ని బోధించారని బాలీవుడ్‌ నటుడు రణ్‌బీర్‌ కపూర్‌ (Ranbir Kapoor) అన్నారు. గత ఏడాది సినిమా రంగానికి చేసిన కృషికి గానూ తాజాగా ఈ ‘యానిమల్‌’ నటుడు ‘మహారాష్ట్రియన్ ఆఫ్‌ ది ఇయర్ అవార్డు’ను అందుకున్నారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ.. ముకేశ్‌ భాయ్‌ తనకు స్ఫూర్తి అని కొనియాడారు.

‘నేను మీకు క్లుప్తంగా ఓ విషయం చెప్పాలనుకుంటున్నా. నాకు జీవితంలో చిన్న లక్ష్యాలు ఉన్నాయి. మంచిగా పనిచేయాలి.. వినయంతో ఉండాలి. ఈ విషయంలో నాకు ముకేశ్‌ భాయ్‌ స్ఫూర్తి. ఆయన నాకు ఒక విషయం చెప్పారు. విజయాన్ని తలకెక్కించుకోకుండా పనిచేసుకుంటూ వెళ్లాలన్నారు. అలాగే అపజయాన్ని మనసుకు తీసుకోవద్దని, అది మనల్ని కిందికి లాగకుండా చూసుకోవాలని సూచించారు’ అని తాను అందుకున్న సలహాను రణ్‌బీర్‌ వెల్లడించారు. అలాగే ఒక మంచి పౌరుడిగా, కుటుంబ సభ్యుడిగా ఉండాలన్నారు. ముంబయికి చెందిన వ్యక్తిగా గర్వపడుతుంటానన్నారు.

రివ్యూ: భామాకలాపం-2.. ప్రియమణి చేసిన సాహసం మెప్పించిందా?

సందీప్‌రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందిన యాక్షన్‌ డ్రామా ‘యానిమల్‌’లో.. తండ్రి అంటే అంతులేని ప్రేమ ఉన్న కుమారుడిగా నటించి రణ్‌బీర్‌ ఆకట్టుకున్నారు. సినీ ప్రియులకు కావలసినంత ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చిన ఈ సినిమాకు సీక్వెల్‌ను తీసుకురానున్నట్లు డైరెక్టర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని