Vijay-Rashmika: ‘గీత గోవిందం’ రిపీట్ కానుందా..!
2018లో మంచి విజయాన్ని అందుకున్న సినిమా గీత గోవిందం. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయం సాధించింది. తాజాగా ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే వార్త చక్కర్లు కొడుతోంది.
హైదరాబాద్: టాలీవుడ్‌లో ఉన్న టాలెంటెడ్ డైరెక్టర్‌లలో ఒకరైన పరశురామ్(Parasuram), సెన్సెషనల్ హీరో విజయ్ దేవరకొండ( Vijay Deverakonda) కాంబినేషన్‌లో గీత గోవిందం(Geetha Govindam) సినిమా వచ్చి అలరించిన విషయం తెలిసిందే. చిన్న సినిమాగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. అటు విజయ్‌ని, ఇటు రష్మిక(Rashmika)ను ఫ్యామిలీ ఆడియన్స్‌కు బాగా దగ్గర చేసింది. అయితే తాజాగా ఫిల్మ్ నగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే నిజమైతే విజయ్, రష్మిక మూడోసారి కలిసి నటిస్తారు. గతంలో గీత గోవిందం, డియర్ కామ్రెడ్ సినిమాల్లో ఈ జోడి ప్రేక్షకులను అలరించింది.
ప్రస్తుతం బాలకృష్ణతో పరుశురామ్ సినిమా తీయనున్నారు. ఈ సినిమా పట్టాలెక్కడానికి ఇంకా సమయం ఉన్నందున ఈలోపు విజయ్‌తో సినిమా తీసే ఆలోచనలో ఉన్నారని టాక్. ఇక విజయ్ దేవరకొండ శివ నిర్వాణ దర్శకత్వంలో ‘‘ఖుషి’’లో నటిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ సరసన అగ్ర కథానాయిక సమంత నటిస్తోంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News
Gurugram: ‘నేనేం తప్పు చేశాను.. నాకెందుకు ఈ శిక్ష’... 14 ఏళ్ల బాలికపై దంపతుల పైశాచిక దాడి!
-
Politics News
MLC Kavitha: జాతీయవాదం ముసుగులో దాక్కుంటున్న ప్రధాని మోదీ: ఎమ్మెల్సీ కవిత
-
Sports News
IND vs AUS: అరుదైన రికార్డుకు అడుగు దూరంలో అశ్విన్.. ‘100’ క్లబ్లో పుజారా
-
General News
CBI: ఎమ్మెల్యేలకు ఎర కేసు వివరాలివ్వండి.. సీఎస్‌కు ఆరోసారి లేఖ రాసిన సీబీఐ
-
India News
Earthquake: తుర్కియేలో భారతీయులు సేఫ్.. ఒకరు మిస్సింగ్
-
Crime News
Hyderabad: బామ్మర్ది ఎంత పనిచేశావ్.. డబ్బు కోసం ఇంత బరితెగింపా?